AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC: ఇండస్ ఇండ్ బ్యాంకులో వాటా పెంచుకోనున్న ఎల్ఐసీ.. ఆమోదం తెలిపిన ఆర్బీఐ!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇండస్ఇండ్ బ్యాంక్‌లో తన వాటాను 9.99%కి పెంచుకోవడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)కు ఆమోదాన్ని తెలిపింది.

LIC: ఇండస్ ఇండ్ బ్యాంకులో వాటా పెంచుకోనున్న ఎల్ఐసీ.. ఆమోదం తెలిపిన ఆర్బీఐ!
Lic Investment In Indus Ind Bank
KVD Varma
|

Updated on: Dec 10, 2021 | 4:15 PM

Share

LIC: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇండస్ఇండ్ బ్యాంక్‌లో తన వాటాను 9.99%కి పెంచుకోవడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)కు ఆమోదాన్ని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యాంకులో ఎల్‌ఐసీకి 4.95% వాటా ఉంది. ఈ ఆమోదం 8 డిసెంబర్ 2022 వరకు చెల్లుబాటు అవుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఆమోదం గురించి గురువారం తెలియజేసినట్లు బ్యాంక్ బీఎస్ఈ(BSE) ఫైలింగ్‌లో తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేట్ బ్యాంకుల్లో 5% కంటే ఎక్కువ వాటాను పెంచుకోవాలంటే ఆమోదం తప్పనిసరి. నవంబర్‌లో, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో తన వాటాను పెంచుకోవడానికి ఎల్‌ఐసికి ఆర్బీఐ అనుమతించింది.

అనేక ప్రైవేట్.. ప్రభుత్వ బ్యాంకులలో ఎల్ఐసి(LIC) వాటాలు..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఎల్ఐసీ అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారులలో ఒకటి. అనేక ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులలో వాటాను కలిగి ఉంది. ఐడీబీఐ(IDBI) బ్యాంక్‌లో ఎల్ఐసీ(LIC) అత్యధికంగా 49.24% వాటాను కలిగి ఉంది.

ఇది కాకుండా, ఎల్ఐసీ కెనరా బ్యాంక్ (8.8%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (8.3%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (8.3%), యాక్సిస్ బ్యాంక్ (8.2%), ICICI బ్యాంక్ (7.6%) బ్యాంకుల్లో వాటాలను కలిగి ఉంది.

ప్రైవేట్ బ్యాంకుల ప్రమోటర్లు హోల్డింగ్‌ను 26% వరకు పెంచుకోవచ్చు. ప్రైవేట్ బ్యాంకుల ప్రమోటర్లు కూడా బ్యాంకుల్లో తమ వాటాను అంతకుముందు 15% నుండి 26%కి పెంచుకోవడానికి ఆర్బీఐ అనుమతిచ్చింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ని నడుపుతున్న హిందూజాస్ కి  దీనిపై చాలా ఆసక్తి ఉంది.

కాగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అనే విషయం తెలిసిందే. ఎల్ఐసీ తన సొమ్మును వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతుంది. ఈ క్రమంలోనే బ్యాంకుల్లో కూడా పెట్టుబడులు పెడుతుంది. ఎప్పటికప్పుడు తన పెట్టుబడులను సమీక్షించుకుంటూ.. కొత్తగా పెట్టుబడులు పెట్టడం లేదా ఇప్పటికే ఉన్న వాటి నుంచి బయటకు  రావడం వంటి వ్యాపార నిర్ణయాలు తీసుకుంటుంది ఎల్ఐసీ. ఇప్పుడు ఆ కోవలోనే ఇండస్ ఇండ్ బ్యాంకులో పెట్టుబడులు పెంచడానికి నిర్ణయం తీసుకుని ఆర్బీఐ అనుమతి కోరింది ఎల్ఐసీ ప్రతిపాదనలకు ఆర్బీఐ అనుమతి మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి: Bipin Rawat: జనరల్ బిపిన్ రావత్‌ పేరుకు ముందు ఉండే ‘PVSM, UYSM’ గురించి మీకు తెలుసా?.. వాటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..!

Judge – Magistrate: న్యాయమూర్తి, మేజిస్ట్రేట్.. లాయర్, అడ్వొకేట్.. తేడాలేంటో తెలుసా? అయితే, ఇప్పుడే తెలుసుకోండి..!