Bipin Rawat: జనరల్ బిపిన్ రావత్‌ పేరుకు ముందు ఉండే ‘PVSM, UYSM’ గురించి మీకు తెలుసా?.. వాటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..!

Bipin Rawat: తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో దేశంలోనే తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా మొత్తం

Bipin Rawat: జనరల్ బిపిన్ రావత్‌ పేరుకు ముందు ఉండే ‘PVSM, UYSM’ గురించి మీకు తెలుసా?.. వాటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..!
Bipin Rawat Awards
Follow us

|

Updated on: Dec 10, 2021 | 2:24 PM

Bipin Rawat: తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో దేశంలోనే తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా మొత్తం 13 మంది మరణించారు. ఈ హెలికాప్టర్ ప్రమాదం తర్వాత, జనరల్ రావత్ గురించి సోషల్ మీడియా, వార్తాపత్రికలు, మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే బిపిన్ రావత్‌కు సంబంధించి ఆయన పలు కీలక, ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో సీడీఎస్ బిపిన్ రావత్ పేరు ముందు PVSM, UYSM, AVSM, YSM, SM, VSM, ADC వంటి పదాలు రాయడం మీరు గమనించే ఉంటారు. మరి వీటి అర్థం ఏంటో ఎవరికైనా తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

జనరల్ బిపిన్ రావత్ పేరు ఇలా ఉంటుంది. ‘CDS జనరల్ బిపిన్ రావత్ PVSM UYSM AVSM YSM SM VSM ADC’. ఇప్పుడు ఆయన చనిపోవడంతో పేరుకు తరువాత రాసిన అవార్డ్స్ పేర్లన్నీ ఇప్పుడు పేరు ముందు రాయడం జరుగుతుంది. మరి ఇలా రాయడం వెనుక ఉన్న అర్థం ఏంటి? ప్రతీ పదానికి అర్థం ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఆర్మీలో సేవాకార్యక్రమాలకు ప్రతిఫలిలంగా లభించిన పథకాల పేర్లు అవి. ఒక ఆర్మీ అధికారికి ఎన్ని పతకాలు వచ్చాయో వాటి పేర్లను షార్ట్‌ఫామ్‌లో పేర్కొనడం జరుగుతుంది. మరి ఏ పతకానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారో తెలుసుకుందాం.

PVSM(పివిఎస్ఎం) పరమ విశిష్ట సేవా పతకం. ఇది శాంతిని నెలకొల్పే క్రమంలో అందించిన విశిష్ట సేవలకు గానూ ఈ సేవా పతకాన్ని అందిస్తారు. సర్వీస్ మెడల్‌లో ఇదే విశిష్ట పతకం.

UYSM(ఎవైఎస్ఎం) ఉత్తమ యుద్ధ సేవా పతకం. యుద్ధ సమయంలో అందించిన విశిష్ట సేవలకు గానూ దీనిని ఇస్తారు. ఇది రెండవ విశిష్ట పతకం.

AVSM(ఏవీఎస్ఎం) అతి విశిష్ట సేవా పతకం అని అర్థం. ఇది శాంతి సమయంలో విశిష్ట సేవలకు అందించే సేవా పతకం. సర్వీస్ మెడల్‌లో ఇది రెండో అత్యధిక పతకం. అయితే ఈ విభాగంలో రావత్‌కు పరమ విశిష్ట సేవా పతకం లభించింది.

YSM(వైఎస్ఎం) దీని అర్థం యుద్ధ సేవా పతకం. యుద్ధ సమయంలో అందించిన విశిష్ట సేవలకు అందించే మూడవ అత్యున్నత పతకం. అయితే, జనరల్ రావత్‌కు ఈ విభాగంలో రెండవ అత్యధిక పతకం అయిన ఉత్తమ యుద్ధ సేవా పతకం కూడా లభించింది.

SM(ఎస్ఎం) సేన పతకం అని అర్థం. సైన్యంలో విశేష సేవలందించినందుకు ప్రతి సైన్యం ఆధారంగా ఈ పతకం ఇవ్వబడుతుంది. సైన్యానికి సేన పతకం, నౌకాదళానికి నావికా పతకం, వైమానిక దళానికి వాయు సేన పతకం ఇస్తారు.

VSM(విఎస్ఎం) విశిష్ట సేవా పతకం అని అర్థం. శాంతి సమయంలో విశిష్ట సేవలందించినందుకు లభించే మూడో అత్యున్నత పతకం ఇది. అయితే, రావత్‌ ఈ విభాగంలో పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం పొందారు.

ADC(ఏడీసీ) దీని అర్థం ఎయిడ్-డి-క్యాంప్స్. అగ్రశ్రేణి అధికారులకు వ్యక్తిగత సహాయకులుగా పనిచేసే అధికారులకు ఈ పోస్ట్ అందుబాటులో ఉంటుంది.

Also read:

History of Thanks: అందరికీ థ్యాంక్స్ చెబుతారు.. మరి ఆ థ్యాంక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?

Snake in Scooty: స్కూటీలో పాముపిల్ల.. భయంతో హడలిపోయిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Beti Bachao Beti Padhao Scheme: మరీ ఇంత ఘోరమా.. ఆ పథకం నిధులన్నీ ప్రకటనలకే సమర్పయామీ..!