Mobile charging: ఆఫీసులో ఫోన్‌ చార్జింగ్‌ పెట్టుకుంటే జీతం కట్.. వైరల్‌ అవుతోన్న నోటీస్‌..(వీడియో)

స్మార్ట్‌ ఫోన్‌ ప్రస్తుతం మనిషి జీవితంలో ఒక నిత్యావసరంగా మారిపోయింది. ఎవరింటికైనా వెళ్లినప్పుడు ముందుగా మంచి నీళ్లు అడగాల్సింది పోయి ‘సీ పిన్‌’ ఛార్జర్‌ ఉందా.? అని అడుగుతోన్న రోజులివి. స్మార్ట్‌ ఫోన్‌కు ప్రధాన శత్రువు ఛార్జింగ్‌.

Mobile charging: ఆఫీసులో ఫోన్‌ చార్జింగ్‌ పెట్టుకుంటే జీతం కట్.. వైరల్‌ అవుతోన్న నోటీస్‌..(వీడియో)

|

Updated on: Dec 10, 2021 | 9:24 PM


స్మార్ట్‌ ఫోన్‌ ప్రస్తుతం మనిషి జీవితంలో ఒక నిత్యావసరంగా మారిపోయింది. ఎవరింటికైనా వెళ్లినప్పుడు ముందుగా మంచి నీళ్లు అడగాల్సింది పోయి ‘సీ పిన్‌’ ఛార్జర్‌ ఉందా.? అని అడుగుతోన్న రోజులివి. స్మార్ట్‌ ఫోన్‌కు ప్రధాన శత్రువు ఛార్జింగ్‌. ఎంత మంచి ఫోనైనా సరే ఇంటర్‌నెట్‌ వాడుతూ పాటలు వింటే త్వరగా ఛార్జింగ్‌ తగ్గిపోతుంది. దీంతో రోజులో కనీసం రెండుసార్లైనా ఛార్జింగ్‌ చేయాల్సిన పరిస్థితులు. ఈ కారణంగానే ఎక్కడికి వెళ్లినా చార్జర్‌ను వెంట తీసుకెళుతుంటారు. ఇక రోజులో కనీసం 8 నుంచి 10 గంటలు గడిపే ఆఫీసులో ఛార్జర్‌ లేకపోతే పరిస్థితి ఎలా చెప్పండి.దీంతో ఆఫీసుకు వెళ్లడానికి ఐడీ కార్డు ఎంత ముఖ్యమో ఛార్జింగ్‌ కూడా అంతే ముఖ్యంగా మారింది. ఈ క్రమంలోనే మనలో చాలా మంది ఆఫీసుల్లో మొబైల్‌ ఫోన్లను ఛార్జింగ్ చేసుకుంటుండడం చూస్తూనే ఉంటాం. అయితే ఓ ఆఫీసులో ఉంచిన నోటీసు చూసిన ఉద్యోగులు ఖంగుతిన్నారు. ఆఫీసులో మొబైల్‌ ఫోన్లు ఛార్జింగ్‌ చేసుకోకూడదంటూ ఓ నోటీసును అంటించారు. ఇందులో.. ‘ఆఫీసుల్లో ఎవరూ మొబైల్‌ ఫోన్లు కానీ, ఇతర ఎలక్ట్రిక్‌ గ్యాడ్జెట్లు కానీ ఛార్జింగ్ చేసుకోకూడదు. ఇది కచ్చితంగా విద్యుత్‌ను దొంగలించడం కిందికే వస్తుంది. ఇలా చేసిన వారి జీతం కట్‌చేయబడుతుంది, ఆఫీసులో మొబైల్‌ ఫోన్లను స్విచ్చాఫ్‌ చేయాలి’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ ఈ నోటీసుకు సంబంధించిన పోస్టర్‌ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు యాజమ్యానికి మద్ధతు పలుకుతుంటే మరికొందరు మాత్రం.. విమర్శలు కురిపిస్తున్నారు.

Follow us