Viral Video: కొత్త సంప్రదాయానికి తెరతీస్తున్న కొత్త జంటలు.. మహిళాపురోహితులతో పెళ్లి.. వరుడి నుదుటిపై సింధూరం.. వీడియో వైరల్..
Viral Video: భారత దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా అనేక పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఫన్నీ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే..
Viral Video: భారత దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా అనేక పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఫన్నీ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే కొన్ని వీడియోలు సరదాగా ఉన్నా.. ఆలోచింపజేసేవిగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొత్త జంట పెళ్లి వేడుకల సమయంలో వరుడు నుదుట మీద సింధూరం దిద్దుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన కోల్ కతాలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే..
ఇప్పటికే బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్, పాత్రలేఖల వివాహం సందర్భంగా ఓ విషయం తెరపైకి వచ్చింది. రాజ్‌కుమార్ రావ్ స్వయంగా వధువు పాత్రలేఖను తన నుదుటిపై సింధూరం పెట్టమని అడిగి మరీ పెట్టించుకున్న ఓ వీడియో సోషల్ఇ మీడియాలో దర్శనమిచ్చింది. తాజాగా ఈసారి కోల్‌కతాకు చెందిన ఓ జంట ఇలాంటి పని చేయడం వైరల్‌గా మారింది.
వధువు వరుడు షాలినీ సేన్… అంకన్ మజుందార్ లు. ఈ జంట వివాహ వేడుక సమయంలో వధువు షాలినీ సేన్ వరుడు నుదిటిపై సింధూరం దిద్దుతుంది. ఈ సమయంలో వరుడు మంజుదార్ చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆ వీడియో ఇప్పుడు పలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
కోల్‌కతాకు చెందిన షాలిని, అంకన్ అనే నవ దంపతులు డిసెంబర్ 2న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. షాలిని సోదరి కృతిక తమ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. సోదరి కృతిక ఈ వీడియో షేర్ చేస్తూ.. తన అక్క షాలిని పెళ్లిని మహిళా పూజారుల బృందం నిర్వహించిందని కామెంట్ కూడా జతచేసింది. ఈ వివాహ వేడుక కొత్తదనం మరో కోణాన్ని సంతరించుకుందని తెలిపింది. ఇప్పటికే ఈ వీడియో ఇప్పటికే 2,11,000 వ్యూస్ ని సొంతం చేసుకుంది. నెటిజన్ల బృందం ఈ కొత్తజంటను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Also Read: