Viral Video: చిన్నారి ప్రయాణిస్తోన్న కార్ మాత్రమే కాదు.. తన మనసు కూడా చాలా రిచ్.. మనసును కదిలించే వీడియో

సోషల్ మీడియాలో రోజూ కుప్పలు.. తెప్పలుగా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో సొసైటీని ఇన్‌స్పైర్ చేసేవి చాలా తక్కువనేే చెప్పాలి.

Viral Video: చిన్నారి ప్రయాణిస్తోన్న కార్ మాత్రమే కాదు.. తన మనసు కూడా చాలా రిచ్.. మనసును కదిలించే వీడియో
నిండు గర్భిణీ ప్రాణాలు కాపాడిన స్కూలు పాప
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2022 | 3:00 PM

సోషల్ మీడియాలో రోజూ కుప్పలు.. తెప్పలుగా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో సొసైటీని ఇన్‌స్పైర్ చేసేవి చాలా తక్కువనే చెప్పాలి. మిగతా చెత్తే ఎక్కువగా ఉంటుంది. పనికిమాలిన కంటెంట్ అంతా నెట్టింట చిందరవందరగా సర్కులేట్ చేస్తుంటారు కొందరు. అయితే తాజాగా ఓ గొప్ప వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇందులో ఓ స్కూల్‌ వెళ్లే పాప ప్రదర్శించిన మానవత్వం ఎందరికో ఆదర్శనీయం. పాప వయసు చిన్నదైనా.. చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపిస్తోంది. ఈ వీడియో కచ్చితంగా మీ మనసును కదిలిస్తుంది.

వీడియోను గమనిస్తే.. ఒక గర్భిణీ ఆటోలో ప్రసవవేదనతో విపరీతంగా బాధపడుతోంది. అయితే  ఆమె వెళ్తోన్న ఆటో టైర్ పంచర్ అవటంతో పక్కన ఆపి డ్రైవర్  టైర్ మారుస్తున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో పంచర్ వేసేసరికి ఆలస్యం.. అవుతుందని భావించిన డ్రైవర్ రోడ్డుపై వెళ్తోన్న వాహనదారులను సాయం కోసం అభ్యర్థించడం ప్రారంభించాడు. ఆటోలో ఉన్న గర్భిణీ వైపు చూపిస్తూ సాయం చేయాలని కోరుతున్నాడు. అయితే  ఎవరూ అతడిని పట్టించుకోవడం లేదు. అలానే ఓ బిఎమ్‌డబ్ల్యూ  కారు కూడా ఆటోను క్రాస్ చేసి వెళ్లింది. అయితే అనూహ్యంగా కొన్ని సెకన్ల తర్వాత ఆ కారు వెనక్కి వచ్చి ఆటో వద్ద ఆగింది. అందులోనుంచి ఓ చిన్నారి దిగింది. వెంటనే పరిగెత్తుకుంటూ ఆటోలోని గర్భిణీ వద్దకు వెళ్లింది. ఆమె ప్రసవవేదన చూసి.. వెంటనే కారులోని వాటర్ బాటిల్ తీసుకొచ్చి నీరు తాగించింది. అనంతరం కార్ వెనుక సీట్లో ఫోన్ మాట్లాడుతున్న తన కుటుంబ సభ్యుడిని వచ్చి.. చూడాలని కోరింది. దీంతో అతడు కారులో నుంచి దిగి గర్భిణీని ఆటోలోంచి దించి, కార్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లటం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ కార్‌లోని వ్యక్తులకు చేతులెత్తి దండం పెడతాడు. ఈ వీడియో చూసి కరగని మనసు అంటూ ఉండదు. మీరు వీడియో చూశాక చిన్నారి ప్రమాణిస్తోన్న కార్ మాత్రమే కాదు.. ఆమె మనసు కూడా చాలా రిచ్ అనక మానరు.

ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ధరమ్‌వీర్ మీనా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఈ పాపకు సెల్యూట్’  అంటూ ట్యాగ్ లైన్ రాసి పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ పాపను ఎంతో ప్రశంసిస్తున్నారు. మరికొందరు ఈ వీడియో స్క్రిప్ట్‌గా ఉన్నప్పటికీ, దాని ద్వారా మానవత్వాన్ని చాటిచెప్పే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కాగా విచారణలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు లోబో సమాజంలో అవగాహన కోసం ఈ  వీడియోను తీసినట్లు తెలిసింది.

Also Read:  రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్​ చేసిన హీరో అతనొక్కడే.. కీలక కామెంట్ చేసిన కీరవాణి