Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫేమస్‌ మహిళా క్రికెటర్‌ని గుర్తుపట్టారా..! ఐపీఎల్‌లో మార్పులు ముందుగానే ఊహించింది..

Punam Raut: భారత్‌లో మహిళా క్రికెట్‌కి మంచిరోజులు వచ్చాయి. మహిళా ప్లేయర్లందరు ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారు. అయితే బిబిఎల్

ఈ ఫేమస్‌ మహిళా క్రికెటర్‌ని గుర్తుపట్టారా..! ఐపీఎల్‌లో మార్పులు ముందుగానే ఊహించింది..
Punam Raut
Follow us
uppula Raju

|

Updated on: Dec 10, 2021 | 4:14 PM

Punam Raut: భారత్‌లో మహిళా క్రికెట్‌కి మంచిరోజులు వచ్చాయి. మహిళా ప్లేయర్లందరు ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారు. అయితే బిబిఎల్ తరహాలో భారత్‌లో మహిళల ఐపిఎల్‌ను నిర్వహించడంపై నిరంతరం చర్చ జరుగుతోంది. బిసిసిఐ దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పురుషుల ఐపీఎల్‌తో పాటు మహిళల మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహిస్తుంది. భారత అత్యుత్తమ క్రీడాకారిణి పూనమ్ రౌత్ దేశంలో మహిళల ఐపీఎల్‌ను నిర్వహించడంపై తన అభిప్రాయాన్ని తెలిపింది. మహిళల ఐపీఎల్‌ క్రీడాకారిణులకు తమను తాము నిరూపించుకోవడానికి మంచి వేదిక అవుతుందని చెబుతోంది.

ఇప్పుడు దేశంలో మహిళల క్రికెట్‌లో చాలా మెరుగుదల ఉందని, మహిళల ప్రపంచ కప్-2017లో భారత్ ఫైనల్‌కు చేరడమే ఇందుకు కారణమని పూనమ్ చెప్పింది. ఈ ప్రపంచకప్ ఫైనల్‌ భారత్‌లో మహిళా క్రికెట్‌ను గొప్పగా మార్చిందని అభిప్రాయపడింది. ఆ మ్యాచ్ చివరి మ్యాచ్‌లో పూనమ్ 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. ఫైనల్‌లో 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు పటిష్టంగా కనిపించినప్పటికీ, 191/3 నుంచి 219 పరుగులకు పడిపోయింది. జట్టు కేవలం 9 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. అయితే ఫైనల్‌లో భారత్ ఓడిపోయినా కూడా దేశంలో మహిళల క్రికెట్‌లో పరిస్థితులు మారిపోయాయి. మహిళల ఐపీఎల్ నిర్వహణ గురించి కూడా పూనమ్ మాట్లాడింది.

మహిళల ఐపీఎల్‌ను ఐదు లేదా ఆరు జట్లతో లీగ్‌ నిర్వహించవచ్చని పూనమ్‌ భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ” నేను మహిళల ఐపిఎల్ గురించి చాలా ఆశాజనకంగా ఉన్నాను. పురుషులలో కొత్త కొత్త ఆటగాళ్లు ఎలా వెలుగులోకి వస్తున్నారో మహిళలలో కూడా కొత్త క్రీడామణలు బయటికి వస్తారు. తమ టాలెంట్‌ని నిరూపించుకోవడానికి యువతకు అవకాశం లభించినట్లవుతుంది. భారత జట్టు నుంచి తొలగించిన ఆటగాళ్లు కూడా తమను తాము నిరూపించుకోవడానికి ఇది మంచి వేదిక” అని తెలిపింది.

Bird Flu in Kerala: కేరళలో మరోసారి బర్డ్‌ ఫ్లూ కలకలం.. కోళ్లు, పెంపుడు జంతువులను చంపాలని నిర్ణయం..

మీరు సెకండ్‌ హ్యాండ్‌ వాహనం కొంటున్నారా..! దాని ఇన్సూరెన్స్‌ వివరాలు ఆన్‌లైన్‌లో చెక్‌ చేయండి..

Khiladi: మాస్ రాజా ఫ్యాన్స్‌కు షాక్.. రవితేజ సినిమా వాయిదా పడనుందా..? కారణం ఏంటంటే..