Cricket: 9 బంతుల్లో 50 పరుగులు.. సిక్సర్లతో బౌలర్లను ఏకిపారేసిన బ్యాట్స్‌మెన్.. దెబ్బకు సీన్ రివర్స్!

టీ20 ఫార్మాట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు సర్వసాధారణం. ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్(LPL 2021)లో బ్యాట్స్‌మెన్లు...

Cricket: 9 బంతుల్లో 50 పరుగులు.. సిక్సర్లతో బౌలర్లను ఏకిపారేసిన బ్యాట్స్‌మెన్.. దెబ్బకు సీన్ రివర్స్!
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 10, 2021 | 1:59 PM

టీ20 ఫార్మాట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు సర్వసాధారణం. ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్(LPL 2021)లో బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోతున్నారు. బౌండరీల రూపంలో పరుగులు రాబట్టుకుంటూ బౌలర్లను వీక్షకులుగా మార్చేశారు. ఇప్పటిదాకా ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు జరగ్గా.. అన్ని కూడా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ల మాదిరిగా ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని ఇచ్చాయి ఇక తాజాగా జరిగిన మ్యాచ్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్లు చిన్న సైజ్ విధ్వంసాన్ని సృష్టించారు. మొత్తం 28 ఓవర్ల మ్యాచ్‌లో ఏకంగా 27 సిక్సర్లు బాదేశారు. ఇందులో ఒక బ్యాట్స్‌మెన్ వరుసగా 5 సిక్సర్లు కొట్టాడు. అయినా మ్యాచ్‌ను గెలవలేకపోయాడు. ఆ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి..

డిసెంబర్ 8 బుధవారం నాడు టోర్నమెంట్ ఏడో మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జాఫ్నా కింగ్స్, క్యాండీ వారియర్స్ మధ్య జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను చెరో 14 ఓవర్లకు కుదించారు. దీనితో బ్యాట్స్‌మెన్ల విధ్వంసం బయటకొచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్ 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. శ్రీలంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో 23 బంతుల్లో 7 సిక్సర్లతో 53 పరుగులు, తిసారా పెరరా 21 బంతుల్లో 6 సిక్సర్లతో 53 పరుగులు చేశారు. క్యాండీ వారియర్స్ బౌలర్లలో షిరాజ్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. విముక్తి, అమిన్, మెండిస్‌లు చెరో వికెట్ తీశారు.

మరోవైపు 182 పరుగులు భారీ టార్గెట్ చేధించే క్రమంలో బరిలోకి దిగిన క్యాండీ వారియర్స్ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ చరిత్ అసలంక 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు.. మరో ఓపెనర్ లెవీస్ 36 బంతుల్లో 41 పరుగులు చేశారు. ఇక వన్ డౌన్‌లో దిగిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్ పావెల్ జాఫ్నా బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 19 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతడు తన ఇన్నింగ్స్‌లో కేవలం 9 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 50 పరుగులు చేశాడు.

చివరి వరకు ఉత్కంఠ..

పావెల్ ఔట్ కావడంతో క్యాండీ వారియర్స్ జట్టు విజయావకాశాలు సన్నగిల్లాయి. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోవడంతో క్యాండీ జట్టు చివరి 2 ఓవర్లలో 32 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆ జట్టు 16 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. దీనితో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం.. జాఫ్నా కింగ్స్ 14 పరుగుల తేడాతో మ్యాచ్‌ గెలిచింది.

Also Read: సోఫాలో నుంచి వింత శబ్దాలు.. భయం భయంగా పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!