Cyber Crime: సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన మాజీ క్రికెటర్.. అకౌంట్ నుంచి డబ్బు మాయం.. అసలేమైందంటే?
బ్యాంకు అధికారిలా ఓ వ్యక్తి కాంబ్లికి ఫోన్ చేశాడు. KYC డేటాను అప్‌డేట్ చేయాలంటూ మాట్లాడాడు. అయితే ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరాడు. యాప్‌లో..
Vinod Kambli: భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ సైబర్ దుండగుల చేతిలో బలి అయ్యాడు. కేవైసీ డేటాను అప్‌డేట్ చేసే పేరుతో అతడి ఖాతా నుంచి రూ.1.1 లక్షలు డ్రా అయ్యాయి. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కాంబ్లీ కేసు నమోదు చేశారు. పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. తాను బ్యాంకు అధికారినని ఓ వ్యక్తి కాంబ్లికి ఫోన్ చేశాడు. వారి KYC డేటాను అప్‌డేట్ చేయాలంటూ మాట్లాడాడు. అయితే ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాప్‌లో డేటాను అప్‌లోడ్ చేసిన వెంటనే కాంబ్లీ మొబైల్‌పై రిమోట్ యాక్సెస్ లభించడంతో పాటు బ్యాంకు నుంచి వన్‌టైమ్ పాస్‌వర్డ్ కూడా తెలుసుకుని రూ.1.1 లక్షలు బదిలీ చేసుకున్నారు.
డబ్బు విత్‌డ్రా చేసిన వెంటనే కాంబ్లీకి అలర్ట్ మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయిన కాంబ్లీ వెంటనే కస్టమర్ కేర్‌కు సమాచారం అందించి బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేశాడు. ఈ కేసులో కాంబ్లీ ఖాతా నుంచి డబ్బు ఎవరి ఖాతాలోకి బదిలీ అయ్యిందో పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు.
వన్డేల్లో 32.59 సగటుతో పరుగులు చేసిన వినోద్ కాంబ్లీ, భారత్ తరఫున 17 టెస్టుల్లో 54.2 సగటుతో 1,084 పరుగులు చేశాడు. 104 వన్డేల్లో 32.59 సగటుతో 2,477 పరుగులు చేశాడు.