Viral: సోఫాలో నుంచి వింత శబ్దాలు.. భయం భయంగా పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!

వాహనాల్లోనే కాదు... టైమ్ బాగోకపోతే సోఫాలో కూర్చున్నా పాము కాటేయొచ్చు. ఓ వ్యక్తి అప్పుడే కొత్తగా కొని తెచ్చుకున్న...

Viral: సోఫాలో నుంచి వింత శబ్దాలు.. భయం భయంగా పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!
Sofa
Follow us

|

Updated on: Dec 09, 2021 | 1:36 PM

వాహనాల్లోనే కాదు… టైమ్ బాగోకపోతే సోఫాలో కూర్చున్నా పాము కాటేయొచ్చు. ఓ వ్యక్తి అప్పుడే కొత్తగా కొని తెచ్చుకున్న సోఫాలో భారీ సర్పం ఉండటం చూశాడు. కాసేపు సోఫాలో నుంచే ఆ పాము అతన్ని ముప్పు తిప్పలు పెట్టింది. లక్కీగా ఆ వ్యక్తి ముందే చూశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే.. అతడి పరిస్థితి ఎలా ఉండేదో.

అమెరికా ఫ్లొరిడాలో నివసిస్తున్న ఓ వ్యక్తి భయం భయంగా క్లియర్‌వాటర్ పోలీసులకు ఫోన్ చేశాడు. వణుకుతున్న స్వరంతో.. తన ఇంట్లోకి పాము దూరిందని చెప్పాడు. దీంతో పోలీసులు స్నేక్ రెస్క్యూ టీమ్‌తో అతడి ఇంటికి చేరుకున్నారు. వారికి పాము ఎక్కడికి వెళ్లిందో కనిపించలేదు. ఇటీవల అతడు కొనుగోలు చేసిన సోఫాలో ఆ పాము నక్కినట్లు డౌట్‌గా ఉందని చెప్పాడు.

సోఫా వెనుక చిన్న కన్నం ఉండటంతో.. ఆ పాము అందులోకి దూరి ఉంటుందని భావించారు. సోఫాను పైకెత్తి సోదా చేశారు. అతడు ఊహించిందే నిజమైంది. ఓ పాము సోఫాలోని స్ప్రింగ్‌ మధ్యలో నక్కి ఉంది. మొత్తానికి ఆ సోఫా క్లాత్‌ను తొలగించి బోవా కన్స్ట్రిక్టర్ ను బయటకు తీశారు. అయితే అది కాటేసే రకం పాము కాదట. దీనికి చిక్కిన జీవిని తోకతో చుట్టేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తుంది. ఆ తర్వాత అమాంతంగా మింగేస్తుంది. కాగా.. సోఫా నుంచి తీసిన పామును స్థానిక పెట్ షాప్‌‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ