Viral Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. చూస్తుండగానే ఎంత పని అయిపాయే.. సెల్ఫీ దెబ్బకు అబ్బా అన్న చిన్నది..!

Viral Video: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరిటి పట్టిన ఫీవర్.. సెల్ఫీ ఫీవర్. సెల్ఫీ క్రేజ్ మామూలుగా ఉండదు. సెల్ఫీ మోజులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. చాలామంది చావు అంచుల

Viral Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. చూస్తుండగానే ఎంత పని అయిపాయే.. సెల్ఫీ దెబ్బకు అబ్బా అన్న చిన్నది..!
Girl Selfie
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Dec 09, 2021 | 1:58 PM

Viral Video: ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరిటి పట్టిన ఫీవర్.. సెల్ఫీ ఫీవర్. సెల్ఫీ క్రేజ్ మామూలుగా ఉండదు. సెల్ఫీ మోజులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. చాలామంది చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన వారు కోకొల్లలుగా ఉన్నారు. ఇంకొంతమంది అయితే సెల్ఫీ పేరుతో నవ్వులపాలయ్యారు. తాజాగా అలాంటి నవ్వులు పూయించే వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే.. బొబ్బిలి రాజా సినిమాలో వెంకటే చెప్పిన ‘అయ్యో అయ్యో అయ్యయ్యో’ అనే డైలాగ్ గుర్తురాక మానదు. అంతలా నవ్వులు పూచియించింది మరి ఆ వీడియో. ఇంతకీ ఆ ఫన్నీ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం.

ఈ వీడియోలో బ్లూ కలర్ డ్రెస్ ధరించిన ఒక అమ్మాయి కాలువ ఒడ్డున నిలబడి.. రకరకాల ఫోజులు ఇస్తూ, కుప్పిగంతులు వేస్తూ సెల్ఫీలు తీసుకుంటోంది. అయితే కాలువ గట్టు తడిగా ఉండటం, కాలు బ్యాలెన్స్ తప్పడంతో ఆమె ఆ కాలువలో బొక్కబోర్లా పడిపోయింది. ఆ తరువాత తేరుకుని పైకి లేస్తుంది. అయితే నీటి గుంటలో పడిపోవడంతో ఆమె డ్రెస్ అంతా బురదమయం అయ్యింది. కాగా, యువతి నీటి గుంటలో పడటాన్ని పక్కనే ఉన్న మరొకరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అది చూసి నెటిన్లు తెగ నవ్వుకుంటున్నారు. పాపం చిన్నది.. సంతోషం అంతా క్షణాల్లో చిన్నపోయింది అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ ఫన్నీ వీడియోను ఇన్‌‌స్టాగ్రమ్ పేజీ hepgul5లో షేర్ చేయగా.. ఇప్పటి వరకు ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. అంతే స్థాయిలో లైక్స్ కూడా వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

View this post on Instagram

A post shared by hepgul5 (@hepgul5)

Also read:

Minsiter KTR: బీజేపీ, కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్.. తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..

Best Home Loan Interest Rates: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో ఇక్కడ తెలుసుకోండి..!

Shocking News: వేప పుల్ల కోసం వెళ్తే ప్రాణాలే పోయాయి.. మరొకరు మృత్యువుకు హాయ్ చెప్పి వచ్చారు..!

ప్రపంచంలోనే వింతైన గ్రామం !! భూమి మీద కాదు భూమి కింద ఇళ్ళు !! వీడియో