Viral Video: ఎవరూ లేరనుకుంది.. మూడో కంటికి చిక్కింది.. నెట్టింట్లో సంచలనం సృష్టిస్తున్న వీడియో..!
Viral Video: టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు. అసలేమీ రాదు అనుకున్న వారిలోనూ ఏదో ఒక అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. అయితే, మొహమాటం కారణంగానో, బిడియం కారణంగానో
Viral Video: టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు. అసలేమీ రాదు అనుకున్న వారిలోనూ ఏదో ఒక అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. అయితే, మొహమాటం కారణంగానో, బిడియం కారణంగానో వారు తమలోని టాలెంట్‌ను బయటపెట్టారు. కానీ, అది సమయాన్ని బట్టి బయటపడుతుంది. తాజాగా ఓ కంపెనీలో అదే జరిగింది. ఏ కార్యాలయంలో అయినా పని గంటలు ముగిసిన తరువాత ఉద్యోగులందరూ వెళ్లిపోతారు. కేవలం క్లీనర్స్, ఆఫీస్ బాయ్స్, గర్ల్స్ మాత్రమే ఉంటారు. ఆఫీసు క్లీన్ చేయడం సహా, ఇతరు పనులు వారు చేస్తుంటారు. ఇక్కడ కూడా ఓ అమ్మాయి పని చేసే కార్యాలయం ఖాళీ అయ్యింది. ఉద్యోగులందరూ వెళ్లిపోవడదంతో ఆ అమ్మాయి మాత్రమే ఆఫీసులో ఉంది. తానే ఆఫీసు అంతా క్లీన్ చేయాలి. అయితే, ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో తనదే రాజ్యం అనుకుందో ఏమో కానీ.. తనలోని కళను ఒక్కసారిగా బయటపెట్టింది. ఎవరూ లేరు.. నన్నెవరూ చూడరని విశ్వాసంతో అద్భుతమైన కళా ప్రదర్శన చేసింది. క్లీన్ చేసే సామాగ్రి సాయంతో అదిరిపోయే స్టెప్పులేసింది. క్లీనింగ్ చేస్తూనే డ్యాన్స్ ఇరగదీసింది. ఎక్కడో ట్రైనింగ్ తీసుకున్న ప్రొఫెషనల్ డ్యాన్సర్ మాదిరిగా డ్యాన్స్ చేసి వావ్ అనిపించింది. అయితే, ఆ అమ్మాయి కళా ప్రదర్శన అంతా ఆఫీస్ లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
అయితే, మరుసటి రోజు ఆఫీసు ఓపెన్ చేసిన తరువాత ఎంప్లాయిస్ అందరూ వచ్చారు. సర్వర్ స్టోర్ వాళ్లు సీసీ కెమెరాలను పరిశీలించిగా.. ఆ ఫుటేజీల్లో అద్భుతమైన డ్యాన్స్ కనిపించడంతో షాక్ అయ్యారు. ఆఫీసులో క్లీనర్‌గా పని చేసే మహిళ ఆ డ్యాన్స్ వేయడం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఆ క్లీనర్ డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్ చూసి నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. వావ్ వాట్ ఏ టాలెంట్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆమె టాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ వీడియోను @lov4itzy పేరుతో ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయగా.. ఇప్పటి వరకు దీనిని 20 వేలకు పైగా వీక్షించారు. వేలాది లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. ఈ అద్భుతమైన వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
itzy saw this viral video @ITZYofficial pic.twitter.com/QJ9tLHTZdC
— ?? (@lov4itzy) December 6, 2021
Also read:
Shocking News: వేప పుల్ల కోసం వెళ్తే ప్రాణాలే పోయాయి.. మరొకరు మృత్యువుకు హాయ్ చెప్పి వచ్చారు..!
ప్రపంచంలోనే వింతైన గ్రామం !! భూమి మీద కాదు భూమి కింద ఇళ్ళు !! వీడియో