AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Home Loan Interest Rates: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో ఇక్కడ తెలుసుకోండి..!

Best Home Loan Interest Rates: మీరు సొంతంగా ఇల్లు కొనాలని భావిస్తున్నారా? ఇందుకోసం హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? ఏ బ్యాంకు ఎంత వడ్డీకి హోమ్ లోన్ ఇస్తుందో తెలియదా?

Best Home Loan Interest Rates: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో ఇక్కడ తెలుసుకోండి..!
Home Loans
Shiva Prajapati
|

Updated on: Dec 07, 2021 | 1:57 PM

Share

Best Home Loan Interest Rates: మీరు సొంతంగా ఇల్లు కొనాలని భావిస్తున్నారా? ఇందుకోసం హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? ఏ బ్యాంకు ఎంత వడ్డీకి హోమ్ లోన్ ఇస్తుందో తెలియదా? అయితే, హోమ్ లోన్స్‌కి సంబంధించి.. ఏ బ్యాంక్ ఎంత వడ్డీకి రుణాలు ఇస్తుందో ఇక్కడ తెలుసుకోండి. సాధారణంగానే.. హోమ్ లోన్ మీ స్వంత ఇంటిని కలను నెరవేర్చుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే, హోమ్ లోన్ అనేది వ్యక్తి తీసుకునే అతిపెద్ద రుణంగా పేర్కొంటారు. లోన్ మొత్తం 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండవచ్చు. ఈ కాలంలో మీరు చెల్లించే మొత్తం.. మీరు తీసుకున్న మొత్తానికి రెండింతలు అయ్యే ఛాన్స్‌ ఉంది. దీనికి కారణం వడ్డీ రేటు అని చెప్పాలి. అందుకే.. రుణ భారం ఎక్కువగా పడకుండా, ఏ బ్యాంకులైతే తక్కువ వడ్డీకి హోమ్ లోన్స్ ఇస్తాయో వాటికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తే రుణ భారం తగ్గుతుంది. ఇప్పుడు మనం ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ లోన్ మొత్తం రూ. 30 లక్షలు, దానికి 20 సంవత్సరాల వాల వ్యవధి అనుకుంటే.. ఎంత కట్టాల్సి ఉంటుంది? ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటు ఇస్తోంది వంటి వివరాలు క్లియర్‌గా చూద్దాం.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. వడ్డీ రేటు: 6.40 నుంచి 7.40 శాతం EMI: రూ. 22,191 నుంచి రూ. 23,985 ప్రాసెసింగ్ ఫీజ్: లోన్ మొత్తంలో 0.50 శాతం (గరిష్టంగా రూ. 15,000) అదనంగా GST

ఇండియన్ బ్యాంక్.. వడ్డీ రేటు: 6.50 నుండి 7.50 శాతం EMI: రూ. 22,367 నుండి రూ. 24,168 ప్రాసెసింగ్ ఫీజ్: లోన్ మొత్తంలో 0.20 నుండి 0.40 శాతం (గరిష్టంగా రూ. 50,000)

బ్యాంక్ ఆఫ్ బరోడా.. వడ్డీ రేటు: 6.50 నుండి 8.10 శాతం EMI: రూ. 22,367 నుండి రూ. 25,280 ప్రాసెసింగ్ ఫీజ్: లోన్ మొత్తంలో 0.50 శాతం వరకు (కనీస రూ. 8,500, గరిష్టంగా రూ. 25,000) అదనంగా GST

బ్యాంక్ ఆఫ్ ఇండియా.. వడ్డీ రేటు: 6.50 నుండి 8.85 శాతం EMI: రూ. 22,367 నుండి రూ. 26,703 ప్రాసెసింగ్ ఫీజ్: 31 డిసెంబర్ 2021 వరకు ప్రాసెసింగ్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.

కోటక్ మహీంద్రా బ్యాంక్.. వడ్డీ రేటు: 6.55 నుండి 7.20 శాతం EMI: రూ. 22,456 నుండి రూ. 23,620 ప్రాసెసింగ్ రుసుము: లోన్ మొత్తంలో 2% ప్రాసెసింగ్ ఫీజ్, GST.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. వడ్డీ రేటు: 6.60 నుండి 7.60 శాతం EMI: రూ. 22,544 నుండి రూ. 24,352 ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంలో 0.25 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజ్.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. వడ్డీ రేటు: 6.70 నుండి 6.90 శాతం EMI: రూ. 22,722 నుండి రూ. 23,079 ప్రాసెసింగ్ ఫీజు: పూర్తి తగ్గింపు

Also read:

Vehicle Checking: వాహన తనిఖీలో పట్టుబడ్డ బైక్.. చెక్ చేస్తే మైండ్ బ్లాంక్ చలాన్లు.. బండి వదిలి పరారైన వాహన దారుడు..!

Children Protest: మాకు న్యాయం కావాలి.. రోడ్డెక్కిన చిన్నారులు.. ఇంతకీ వారి డిమాండ్ ఏంటంటే..!

Hyderabad Drunk and Drive: హైదరాబాద్‌లో ఒకే రోజు 3 రోడ్డు ప్రమాదాలు.. పోలీసుల రియాక్షన్ మామూలుగా లేదుగా..!

Follow Us
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?
పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు
పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు
మామిడి టెంకలతో అద్భుతమైన అందం! చర్మం, జుట్టు సమస్యలకు దివ్యౌషధం!
మామిడి టెంకలతో అద్భుతమైన అందం! చర్మం, జుట్టు సమస్యలకు దివ్యౌషధం!
మీ కళ్లకు పరీక్ష.. ఆ 2 బేసి సంఖ్యలను 11 సెకన్లలో కనిపెట్టగలరా?
మీ కళ్లకు పరీక్ష.. ఆ 2 బేసి సంఖ్యలను 11 సెకన్లలో కనిపెట్టగలరా?
మారుతి సుజుకి కార్లపై బంపర్ ఆఫర్లు.. రూ.2.15 లక్షల వరకు తగ్గింపు!
మారుతి సుజుకి కార్లపై బంపర్ ఆఫర్లు.. రూ.2.15 లక్షల వరకు తగ్గింపు!
అనారోగ్యంతో నటుడు మృతి.. స్టార్ హీరో ఎమోషనల్..
అనారోగ్యంతో నటుడు మృతి.. స్టార్ హీరో ఎమోషనల్..
ఛీ.. ఛీ.. ఇదేం సెలెక్షన్? బంగారం లాంటి ప్లేయర్‌ను కాదని..
ఛీ.. ఛీ.. ఇదేం సెలెక్షన్? బంగారం లాంటి ప్లేయర్‌ను కాదని..
పెరుగును ఎప్పుడు, ఎలా తినాలి..? ఆయుర్వేదం చెప్పే ఈ విషయాలను..
పెరుగును ఎప్పుడు, ఎలా తినాలి..? ఆయుర్వేదం చెప్పే ఈ విషయాలను..
సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్న ట్యాలెంటెడ్ హీరో! కారణమేమిటంటే?
సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్న ట్యాలెంటెడ్ హీరో! కారణమేమిటంటే?
వానరాల మజాకా.. ఎండ వేడికి చెక్ పెడుతూ ఏం చేస్తున్నాయో చూస్తే...
వానరాల మజాకా.. ఎండ వేడికి చెక్ పెడుతూ ఏం చేస్తున్నాయో చూస్తే...