Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children Protest: మాకు న్యాయం కావాలి.. రోడ్డెక్కిన చిన్నారులు.. ఇంతకీ వారి డిమాండ్ ఏంటంటే..!

Children Protest: మాకు న్యాయం కావాలి, మా పాఠశాలకు వెంటనే నీళ్ళు రావాలి, మాకు న్యాయం జరిగే వరకు పారోటం ఆగదు అంటూ చిన్న పిల్లలు ధర్నా

Children Protest: మాకు న్యాయం కావాలి.. రోడ్డెక్కిన చిన్నారులు.. ఇంతకీ వారి డిమాండ్ ఏంటంటే..!
Kids
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 07, 2021 | 10:55 AM

Children Protest: మాకు న్యాయం కావాలి, మా పాఠశాలకు వెంటనే నీళ్ళు రావాలి, మాకు న్యాయం జరిగే వరకు పారోటం ఆగదు అంటూ చిన్న పిల్లలు ధర్నా చేయడం ఇప్పుడు సంచలనం రేకెత్తుతోంది. ఆ చిన్నారులు ఉంటున్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వారం రోజులుగా పాఠశాలలో కనీసం స్నానం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీళ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబబాద్ జిల్లా కొత్తగూడ మండలం సాథిరెడ్డిపెల్లి గ్రామంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల దుస్థితి ఇది. ఈ పాఠశాలలో దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు చదువుతూ, వసతి ఉంటున్నారు.

కాగా వారం రోజులుగా ఆశ్రమ పాఠశాలలో నీళ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టల్‌లో కనీసం స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి కూడా నీరు లేకపోవడంతో తల్లిదండ్రులను రప్పించి బట్టలను ఇంటికి పంపుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అధికారుల నిర్లక్ష్యం కారణంగా పొందలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలో ఉండే విద్యార్థుల గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని వాపోతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.. వసతి గృహాల్లో సకల సౌకర్యాలు కల్పించామని ప్రభూత్వం చెబుతుందని, కానీ అధికారులకు మాత్రం సదరు హాస్టల్లో తమ పిల్లలు పడుతున్న ఇబ్బందులు కనిపించడం లేదా అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంపౌండ్ వాల్ కూడా  లేకుండా, ఊరి కి చివరన ఉన్న ఈ ఆశ్రమ పాఠశాలలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న విద్యార్థులకు, కనీసం వౌలిక సదుపాయాలు కూడా అందించలేని దుస్థితిలో అధికారులు ఉన్నారని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి ఈ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వెంటనే నీటి వసతి కల్పించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.

Also read:

Detox Juice: ఆరోగ్యానికి మంచిదని డిటాక్స్ జ్యూస్ తాగుతున్నారా? ఈ జ్యూస్ వలన ఫలితం ఉంటుందా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి

Bigg Boss Tamil: ప్రేమ పేరుతో నగలు, నగదు తీసుకుని పారిపోయాడు.. పోలీసులను ఆశ్రయించిన తమిళ బిగ్‌బాస్‌ నటి..

Gamanam Movie: అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన గమనం హీరో..