Hyderabad: తాగుబోతుల అడ్డాగా మారుతున్న భాగ్యనగరం.. సర్వే రిపోర్ట్‌లో షాకింగ్ అంశాలు
తాగుబోతులకు హైదరాబాద్ అడ్డాగా మారుతోందా? అంటే, అవుననే చెబుతున్నాయ్ లెక్కలు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్ చూస్తే ఎవ్వరికైనా దిమ్మదిరగాల్సిందే.
తాగుబోతులకు హైదరాబాద్ అడ్డాగా మారుతోందా? అంటే, అవుననే చెబుతున్నాయ్ లెక్కలు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్ చూస్తే ఎవ్వరికైనా దిమ్మదిరగాల్సిందే. నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణలోనే మందుబాబులు ఎక్కువగా ఉన్నారంటే… హైదరాబాద్‌లో ఏ రేంజ్‌లో తాగుబోతులు ఉన్నారో అర్ధం చేసుకోండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్ ప్రకారం హైదరాబాద్ జనాభాలో సుమారు 30శాతం తాగుబోతులు ఉన్నారు. ఈ తాగుబోతుల్లో ఏడెనిమిది శాతం మహిళలు ఉన్నట్లు ఆ సర్వే రిపోర్ట్ తేల్చింది. మహిళా డ్రింకర్స్‌లో ఎక్కువమంది హైప్రొఫైల్ లేడీస్, వర్కింగ్ వుమెన్సే ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఇక, GHMC పరిధిలో 500లకు పైగా మద్యం దుకాణాలుంటే… రోజుకి రూ.20 నుంచి 25 కోట్లు… నెలకి రూ.300 కోట్ల నుంచి రూ. 400 కోట్లు… యావరేజ్‌గా అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా రూ.3000 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటే తాగుబోతులు ఏ రేంజ్‌లో తాగేస్తున్నారో చూడండి.
ఇక, మొత్తం తెలంగాణ లెక్కల్ని చూస్తే.. ఏడాదికేడాది తాగుబోతులు పెరిగిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం తెలంగాణ జనాభాలో 20శాతం మంది తాగుబోతులు ఉన్నారు. ఇది నేషనల్ యావరేజ్ కంటే 4 శాతం ఎక్కువ. తెలంగాణలో మూడున్నర కోట్ల మంది ఉంటే… అందులో అర కోటికి పైగా మందుబాబులే. తాగుబోతుల్లో 15-49 ఏజ్ గ్రూప్ వాళ్లే ఎక్కువ. పదిహేనేళ్లకే మద్యానికి బానిసలవుతున్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది.
తెలంగాణలో మద్యాన్ని మంచినీళ్లలా తాగేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలుంటే… ఏటా 35వేల కోట్లకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో రోజుకి సుమారు 20కోట్ల మద్యాన్ని తాగేస్తున్నారు. GHMC పరిధిలో ఎక్కువమంది తాగుబోతులు ఉంటే… మద్యం విక్రయాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ టాప్‌లో ఉంటున్నాయ్. అందుకే, ఇక్కడ తాగుబోతు టెర్రరిస్టుల హత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
Also Read..