‘నాలుగేళ్లు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయ మాటలు చెప్పి నగలు, నగదు తీసుకుని పరారయ్యాడు ‘ అంటూ తమిళ బిగ్‌బాస్ నటి జూలీ అమింజికరై అలియాస్ మరియా జులియానా పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అయ్యావు కాలనీలో ఉండే మనీష్ అనే యువకుడితో నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉంది జూలి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే మనీష్ ఆమెకు మాయమాలు చెప్పి విలువైన బైకు, రిఫ్రిజిరేటర్, నగలు, నగదు తీసుకుని పారిపోయాడు. కొన్ని రోజులుగా అతని జాడ తెలియకపోవడంతో జూలి అన్నానగర్ మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. మనీష్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. కాగా నటి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గతంలో చెన్నైలోని మెరీనాబీచ్ వేదికగా జరిగిన జల్లికట్టు ఉద్యమంలో పాల్గొనడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది జులియానా. ఆ ఉద్యమంలో ఆమె చేసిన నినాదాలకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఇదే క్రేజ్‌తో లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తమిళ బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది. అయితే తోటి కంటెస్టెంట్‌తో గొడవపడి విమర్శలు మూటగట్టుకుంది. మధ్యలోనే షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. అప్పటి నుంచే తరచూ వివాదాల్లో నిలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఖాతాల్లో ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు, వీడియోలపై కూడా నెటిజన్ల నుంచి నెగెటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాను నిలువునా మోసపోయానంటూ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.
Also Read:
Gamanam Movie: అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన గమనం హీరో..
Salaar: సలార్ సినిమా సీన్స్ పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి.. రీ షూట్ చేసేందుకు సిద్ధమైన డైరెక్టర్..