Detox Juice: ఆరోగ్యానికి మంచిదని డిటాక్స్ జ్యూస్ తాగుతున్నారా? ఈ జ్యూస్ వలన ఫలితం ఉంటుందా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి

Detox Juice: ఆరోగ్యానికి మంచిదని డిటాక్స్ జ్యూస్ తాగుతున్నారా? ఈ జ్యూస్ వలన ఫలితం ఉంటుందా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి
Detox Juice

డిటాక్స్ జ్యూస్‌లు ప్రస్తుతం మార్కెట్‌లో చాలా అందుబాటులో ఉన్నాయి. డిటాక్స్ జ్యూస్‌లు తాగడం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. అవి హానికరమా.. ఆరోగ్యకరమా అనే విషయంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

KVD Varma

|

Dec 07, 2021 | 10:39 AM

Detox Juice: డిటాక్స్ జ్యూస్‌లు ప్రస్తుతం మార్కెట్‌లో చాలా అందుబాటులో ఉన్నాయి. డిటాక్స్ జ్యూస్‌లు తాగడం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. అవి హానికరమా.. ఆరోగ్యకరమా అనే విషయంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వాస్తవం ఏమిటంటే, డిటాక్స్ జ్యూస్‌లు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయని అధికారిక ఆధారాలు లేవు. డిటాక్స్ జ్యూస్, టీ, సప్లిమెంట్స్ అన్నీ రకరకాల పదార్థాలను కలిగి ఉంటాయి. వాటిలో కొన్ని ఆరోగ్యానికి మంచివి కావు. డిటాక్స్ జ్యూస్‌ల గురించి మరింత తెలుసుకుందాం.

డిటాక్స్‌లు అంటే ఏమిటి

డిటాక్స్‌లు శరీరాన్ని అన్ని టాక్సిన్స్ నుంచి విముక్తి చేయడం ద్వారా కొత్త జీవితాన్ని ఇస్తాయి. మన శరీరం కాలేయం, మలం, మూత్రపిండాలు, మూత్రం, చెమట ద్వారా సహజ పద్ధతుల్లో ఇటువంటి విషపదార్ధాలను బయటకు పంపుతుంది. కాలేయం కఫర్ కణాల సహాయంతో శరీరంలోని టాక్సిన్‌లను తటస్థీకరిస్తుంది. ఫాగోసైటోసిస్ అనే ప్రక్రియ ద్వారా ఇది సాధ్యమవుతుంది. కుప్ఫెర్ కణాలు అన్ని రకాల టాక్సిన్‌లను స్వీకరించి జీర్ణక్రియ ద్వారా వాటిని బయటకు పంపుతాయి. మూత్రపిండాలు మూత్రం ద్వారా విషాన్ని విసర్జిస్తాయి. పెద్దప్రేగు ఈ స్వీయ శుభ్రపరిచే పనిని కూడా చేస్తుంది.

డిటాక్స్ జ్యూస్‌లు ఏమి చేస్తాయి?

కృత్రిమంగా ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్న డిటాక్స్‌ జ్యూస్‌లలో టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి శరీరంలో ఎలాంటి సహజ పదార్ధాలు ఉన్నాయో అటువంటివే ఉన్నాయని పేర్కొన్నారు. ఇది కాలేయం, శరీరంలోని ఇతర భాగాల నుండి విషాన్ని తొలగిస్తుందని, వాటిని మూత్రం, చెమట ద్వారా విసర్జించవచ్చని ఆ కంపెనీలు చెబుతున్నాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీర ద్రవాలను తగ్గిస్తుంది. బద్ధకాన్ని తొలగిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందేలా చేస్తుంది.

డిటాక్స్ జ్యూస్‌లు ఎప్పుడు హానికరం?

డిటాక్స్ జ్యూస్ తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండనే అంశం మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. డిటాక్స్ జ్యూస్, టీ, సప్లిమెంట్లలోని పదార్థాలు నియంత్రణ లేకుండా తీసుకుంటే హానికరం అని అధ్యయనాలు చెబుతున్నాయి.

కాలేయం టాక్సిన్స్‌ను తటస్థీకరిస్తుంది, కాబట్టి చాలా మంది డిటాక్స్ జ్యూస్ తీసుకోవడం వల్ల అది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది అనుకుంటారు. నిజానికి డిటాక్స్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని ముఖ్యమైన అవయవమైన కాలేయం దెబ్బతింటుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం, గ్రీన్ టీ సారం, ప్రధాన డిటాక్స్ సప్లిమెంట్‌గా ఉపయోగించబడుతుంది. దీనివలన కాలేయం దెబ్బతింటుంది. ఇది కొన్నిసార్లు కాలేయ మార్పిడికి లేదా తినేవారి మరణానికి దారితీస్తుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.

డిటాక్స్ గ్లాస్ జ్యూస్‌లు, పానీయాలలో అనేక గుర్తించలేని పదార్థాలు ఉంటాయి. అవి కొన్నిసార్లు పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఈ పదార్ధాలను అధికంగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరణం కూడా సంభవించవచ్చు.

కొంతమంది బరువు తగ్గడానికి డిటాక్స్ జ్యూస్‌పై ఆధారపడతారు. అయితే, మీరు దీన్ని తీసుకోవడం మానేస్తే, మీరు కొంత బరువు తగ్గవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఆరోగ్యం. అందుకోసం బాగా తిని, సరిగ్గా విశ్రాంతి తీసుకుని, అవసరమైన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి: మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu