- Telugu News Photo Gallery This remedy is beneficial for removing problem of skin blemishes and pimples Skin Care Tips
Beauty Tips: మొహంపై మచ్చలు, మొటిమలు వేధిస్తున్నాయా..? ఇలా చేస్తే తళతళ మెరిసే అందం మీ సొంతం..
Skin Care Tips: ఫేస్ నిగారింపుపై చాలామంది ఎంతో శ్రద్ధపెడుతుంటారు. మొఖంపై ఉండే నల్లని మచ్చలు, మొటిమలు అందాన్ని డ్యామెజ్ చేస్తుంటాయి. అలాంటి వారు ఇంట్లో ఉన్న పలు పదార్థాలతో అందమైన ఆకారాన్ని తయారు చేసుకోవచ్చు. మొటిమలు, డార్క్ స్పాట్‌లను తొలగించేందుకు పలు పద్దతులు పాటిస్తే.. తళతళ మెరిసే అందం మీ సొంతం అవుతుందని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Dec 07, 2021 | 12:50 PM

యాపిల్ సైడర్ వెనిగర్- యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పిగ్మెంట్, డార్క్ స్పాట్‌లను తొలగించడానికి సహాయపడుతుంది. ఒక గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమాన పరిమాణంలో వేసి కలపాలి. ఆ తరువాత మిశ్రామాన్ని ముఖానికి అప్లై చేయాలి. దీంతో ముఖంపై నల్లటి వలయాలు తగ్గుతాయి.

అలోవెరా - అలోవెరా చర్మంపై నల్లటి మచ్చలను తగ్గించి కాంతివంతంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇది పిగ్మెంటేషన్ చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు కలబందను చర్మానికి పట్టించి ఉదయం చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే.. ఫేస్ నిగారింపుగా మారుతుంది.

గ్రీన్ టీ - గ్రీన్ టీ మీ చర్మానికి మంచిది. గ్రీన్ టీ నీటిని ముఖం అప్లై చేసి.. అర్ధగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది నల్ల మచ్చలు, మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

బంగాళదుంప - డార్క్ స్పాట్‌లను తగ్గించడానికి మీరు బంగాళదుంపలను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం బంగాళాదుంపలను కట్ చేసి నల్ల మచ్చలపై ఉంచాలి. అలా కొన్ని నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే నల్లమచ్చలు తగ్గుతాయి. (గమనిక: మచ్చలు, మొటిమలు ఎక్కువగా ఉంటే.. వైద్యుడిని సంప్రదించడం మంచిది.)





























