- Telugu News Photo Gallery Cricket photos Australia vs England head to head: Ashes record ahead of 2021/22 series, 1st test starts from 8th December
Australia vs England Head To Head In Ashes: బూడిద కోసం పోరు.. బలంగానే ఇరుజట్లు.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?
మొదటి యాషెస్ యుద్ధం 1882 సంవత్సరంలో జరిగింది. దీనిని ఇంగ్లండ్ గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాషెస్ పోరులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మొత్తం 71 సార్లు తలపడ్డాయి.
Updated on: Dec 07, 2021 | 12:33 PM

డిసెంబర్ 8 నుంచి 72వ యాషెస్ యుద్ధం ప్రారంభం కానుంది. మొదటి యుద్ధం 1882లో జరిగింది. ఇందులో ఇంగ్లండ్ విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాషెస్ పోరులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మొత్తం 71 సార్లు తలపడ్డాయి. కొన్నిసార్లు ఆస్ట్రేలియా, మరికొన్నిసార్లు ఇంగ్లండ్ విజయాలు సాధించాయి.

యాషెస్ పోరులో గత 71 పర్యాయాలు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ కాలంలో ఆస్ట్రేలియా 33 సార్లు యాషెస్ టైటిల్‌ను గెలుచుకుంది. కాగా, ఇంగ్లండ్ 32 సార్లు విజయం సాధించింది. అదే సమయంలో, ఇరు జట్ల మధ్య సిరీస్ 6 సార్లు టై అయింది.

21వ శతాబ్దం నుంచి అంటే 2000 సంవత్సరం నుంచి ఇరు జట్లు 11 సార్లు యాషెస్ పోరులో తలపడ్డాయి. ఈ సమయంలో, ఇంగ్లండ్ 6 సార్లు, ఆస్ట్రేలియా 5 సార్లు ట్రోఫీని గెలుచుకున్నాయి. ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలిచింది.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన గత 5 యాషెస్ పోరును పరిశీలిస్తే.. ఇక్కడ మ్యాచ్‌లను ఇరుజట్లు సమంగా గెలుచుకున్నాయి. ఆస్ట్రేలియా రెండుసార్లు సిరీస్‌ను గెలుచుకోగా, ఇంగ్లండ్ రెండుసార్లు సిరీస్‌ను గెలుచుకుంది. చివరిగా 2019లో ఆడిన సిరీస్ డ్రాగా ముగిసింది.

ప్రస్తుతం యాషెస్‌లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాను ఓడించి 33వ సారి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్ ప్రయత్నం చేస్తోంది. రెండు జట్ల గణాంకాలు చూస్తుంటే రిజల్ట్‌పై ఇప్పట్లో ఏమీ చెప్పలేం. అయితే పోటీ మాత్రం హోరీహోరీగా సాగనుందనడంలో సందేహం లేదు.





























