- Telugu News Photo Gallery Technology photos Are you looking for a smartphone price under 10000 features and price details
Smart Phone Under 10K: రూ. 10 వేల లోపు స్మార్ట్ ఫోన్ కోసం ప్లాన్ చేస్తున్నారా.? అయితే మీకు ఇవే బెస్ట్ ఆప్షన్స్..
Smart Phone Under 10K: కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? రూ. 10 వేలు మీ బడ్జెటా.. అయితే తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Dec 07, 2021 | 2:41 PM

అన్ని అవసరాలకు స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి అయిన నేపథ్యంలో అందరూ ఫోన్లలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బడ్జెట్ దృష్ట్యా తక్కువ ధరకు ఫోన్‌ను కొనుగోలు చేయానుకునే వారు కూడా ఉంటారు. అలాంటి వారి కోసమే రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న కొన్ని ఫోన్లపై ఓ లుక్కేయండి..

JioPhone Next: ఈ ఏడాది టెక్నాలజీ రంగంలో జియో తీసుకొచ్చిన జియోఫోన్ నెక్ట్స్ ఒక సంచలనంగా చెప్పవచ్చు. అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చారు. రూ. 6,500కే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను మొదట కేవలం రూ. 1,999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 720 x 1440 రిజల్యూషన్‌తో కూడిన 5.45 ఇంచెస్ స్క్రీన్‌ను అందించారు. 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

Micromax IN 2B: ఈ ఫోన్‌లో 6.52 ఇంచెస్ హెచ్+ రిజల్యూషన్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఇక ఇందులో యూనిసోక్ టీ610 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌ను అందించారు. ఇందులో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా అందించారు. ఈ ఫోన్ ధర రూ. 8,999గా ఉంది.

Realme Narzo 30A: తక్కువ బడ్జెట్‌లో వస్తోన్న 4జీ ఫోన్‌లలో రియల్‌మీ నార్జో 30ఏ మొదటి స్థానంలో ఉంది. ఈ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక ఇందులో 6.5 ఇంచెస్ 720 పీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ ఫోన్‌లో 3జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. 13 మెగా పిక్సెల్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 7,499గా ఉంది.

Redmi 9 Prime: రూ. 10 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇదీ ఒకటి. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో మీడియా టెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌ను అందించారు. 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 9,200గా ఉంది.





























