AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధుమేహం ఉన్నవారు ఉడికించిన గుడ్లు తింటే మంచిదేనా ? అధ్యాయనాల్లో సంచలన విషయాలు..

గుడ్డు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో అనేక పోషకాలు ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా

మధుమేహం ఉన్నవారు ఉడికించిన గుడ్లు తింటే మంచిదేనా ? అధ్యాయనాల్లో సంచలన విషయాలు..
Egg
Rajitha Chanti
|

Updated on: Dec 07, 2021 | 10:17 AM

Share

గుడ్డు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో అనేక పోషకాలు ఉండడం వలన రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక ఉడకబెట్టిన గుడ్లు తింటే తగ్గుతారు. ఉడకబెట్టిన గుడ్డులో ప్రోటీన్. ఇది గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలను తగ్గిస్తాయి. కానీ ఇప్పటికే మధుమేహం ఉన్నవారు ఉడకబెట్టిన గుడ్డును తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందామా.

గుడ్డు ప్రోటీన్ పదార్థం. ఇందులో దాదాపు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి శరీర బరువును నియంత్రించడమే కాకుండా.. కండరాల బలాన్ని పెంచుతాయి. అలాగే రక్తపోటును తగ్గించడమే కాకుండా.. ఎముకలను బలోపేతం చేస్తుంది. రోజుకు 2-3 ఉడికించిన గుడ్డును తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‏లో ప్రచురించబడిన ఓ అధ్యాయనం ప్రకారం మూడు నెలలు రోజూ ఉడకబెట్టిన గుడ్డు తినేవారిలో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలో మార్పులు జరుగలేదు. అలాగే బరువు తగ్గినట్లుగా గుర్తించారు. వారానికి 12 గుడ్లు చొప్పున తింటే డయాబెటీస్, టైప్-2 డయాబెటీస్‌తో బాధితులకు గుండె జబ్బుల ముప్పు ఉండదట.  తక్కువ కార్బ్ డైట్‌లతో రోజువారీ ఆహారంలో 2-3 గుడ్లు తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. గుడ్డు ఆకలిని తగ్గిస్తుంది. గుడ్డు తింటే కళ్లు, గుండె ఆరోగ్యం, రక్తనాళాలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. గర్భవతులు గుడ్డు తింటే చాలా మంచిదని సూచించారు. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను పెంచడం ముఖ్యం. గుడ్లు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు. తక్కువ కార్ప్ కూరగాయలు మరియు ఆకు కూరలు కలిపితే బరువును నిర్వహించడానికి కనీసం 2-3 గుడ్లు తీసుకోవాలి. గుడ్లలో శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్ ‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. పొటాషియం, విటమిన్-A, కాల్షియం, ఐరన్, విటమిన్-D, విటమిన్ B6, విటమిన్ B 12, మెగ్నిషియం గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.

Also Read: Pooja Hegde: మీ ఇద్దరిని స్ర్కీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తోంది.. చరణ్‌, తారక్‌ న్యూ లుక్స్‌పై పూజా హెగ్డే..

Bigg Boss 5 Telugu: అలాంటివారికి నువ్వే ఆదర్శం.. పింకీపై ప్రశంసలు కురిపించిన మెగాబ్రదర్‌..

Shyam Singha Roy: సిరివెన్నెల రాసిన చివరి పాట.. శ్యామ్ సింగరాయ్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఎప్పుడంటే..