AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: అలాంటివారికి నువ్వే ఆదర్శం.. పింకీపై ప్రశంసలు కురిపించిన మెగాబ్రదర్‌..

ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో ముందుడే బిగ్‌బాస్‌ రియాలిటీ షో కొందరి జీవితాలు, జాతకాలను మారుస్తుంది. ముఖ్యంగా ఈ షోలో పాల్గొన్న పోటీదారుల క్రేజ్‌ అమాంతం పెరిగిపోతుంది

Bigg Boss 5 Telugu: అలాంటివారికి నువ్వే ఆదర్శం.. పింకీపై ప్రశంసలు కురిపించిన మెగాబ్రదర్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 07, 2021 | 9:52 AM

ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో ముందుడే బిగ్‌బాస్‌ రియాలిటీ షో కొందరి జీవితాలు, జాతకాలను మారుస్తుంది. ముఖ్యంగా ఈ షోలో పాల్గొన్న పోటీదారుల క్రేజ్‌ అమాంతం పెరిగిపోతుంది. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లక ముందు ఏ మాత్రం గుర్తింపు లేనివారు కూడా పాపులారిటీ హౌస్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడ లేని పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి క్రేజ్‌నే ఆస్వాదిస్తోంది ప్రియాంకా సింగ్‌ అలియాస్‌ పింకీ. గతంలో కొన్ని టీవీ షోల్లో పాల్గొన్నప్పటికీ పెద్దగా గుర్తింపు పొందని ఆమె బిగ్‌బాస్‌ షోతో సూపర్బ్‌ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల హౌస్‌ నుంచి బయటకు వచ్చిన పింకీకి ఆమె అభిమానులు స్వాగతం పలుకుతూ చేసిన హంగామా, హడావిడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. కాగా ట్రాన్స్‌జెండర్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ప్రియాంక .. తమన్నా సింహాద్రి లాగే ఎక్కువ రోజులు షోలో కొనసాగలేదని చాలామంది భావించారు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 13 వారాల పాటు హౌస్‌లో కొనసాగింది.

కాగా బిగ్‌బాస్‌ షో ప్రారంభం సమయంలో మెగా బ్రదర్‌ నాగబాబు పింకీకి మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే. ఆమే విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన పింకీ తాజాగా నాగబాబును కలిసింది. ఆయన ఆశీర్వాదం తీసుకుంది. ఈ సందర్భంగా మెగాబ్రదర్‌ పింకీపై ప్రశంసలు కురిపించారు. ‘ఎన్నో అసమానతలు, అడ్డంకులు, అవమానాలను ఎదుర్కొని నువ్వు సంపాదించిన ఈ గొప్ప స్థానం ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నువ్వు బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవకపోవచ్చు. కానీ నిత్యం సమాజంలో నిత్యం నీలా అవమానాలు, హేళన ఎదుర్కొనే వారికి నువ్వు ఒక స్ఫూ్ర్తిగా నిలిచావు. జీవితంలో గెలవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించావు. నా ప్రేమాభిమానాలు, మద్దతు నీకు ఎప్పుడూ ఉంటాయి’ అని నాగబాబు రాసుకొచ్చారు. కాగా గతంలో మెగాబ్రదర్‌ జడ్జీగా వ్యవహరించిన ఓ టీవీ షోలో ప్రియాంక కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Also read:

Megastar Chiranjeevi: స్పీడ్ పెంచిన చిరంజీవి.. మెగా డిసెంబర్ అంటూ నెట్టింట్లో చిరు మేనియా..

SaraTendulkar: మోడలింగ్‌లోకి అడుగు పెట్టిన సచిన్‌ ముద్దుల తనయ.. ఫొటోలు వైరల్‌..

Shyam Singha Roy: సిరివెన్నెల రాసిన చివరి పాట.. శ్యామ్ సింగరాయ్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఎప్పుడంటే..