AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SaraTendulkar: మోడలింగ్‌లోకి అడుగు పెట్టిన సచిన్‌ ముద్దుల తనయ.. ఫొటోలు వైరల్‌..

భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ముద్దుల తనయ సారా టెండూల్కర్‌కు సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సచిన్‌ ఆటతో అభిమానులను సంపాదించుకుంటే అందంతో

SaraTendulkar: మోడలింగ్‌లోకి అడుగు పెట్టిన సచిన్‌ ముద్దుల తనయ.. ఫొటోలు వైరల్‌..
Basha Shek
|

Updated on: Dec 07, 2021 | 8:52 AM

Share

భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ముద్దుల తనయ సారా టెండూల్కర్‌కు సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సచిన్‌ ఆటతో అభిమానులను సంపాదించుకుంటే అందంతో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది సారా. ఇక ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై పట్టున్న ఈ స్టార్‌ కిడ్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసే ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలకు నెటిజన్లు నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మోడలింగ్‌ రంగంలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైందీ ముద్దుగుమ్మ. ఈ మేరకు దుస్తులకు సంబంధించిన ఓ ప్రముఖ బ్రాండ్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ ప్రమోషనల్‌ వీడియో కూడా విడుదలైంది. ఈ వీడియోలో సారాతో పాటు ‘ఆదిత్య వర్మ( అర్జున్‌ రెడ్డి తమిళ రీమేక్‌)’, ‘సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌’ చిత్రాల్లో నటించిన బనితా సంధు, అహన్‌ షెట్టి గర్ల్‌ ఫ్రెండ్‌ తానియా ష్రాఫ్‌ కూడా సందడి చేయడం విశేషం.

సారా విషయానికొస్తే..ముంబయిలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆతర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లి యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో మెడిసిన్‌ చదివింది. ఇక ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై ఆసక్తి పెంచుకున్న సారా సినిమా రంగంలోకి అడుగుపెడుతుందని గతంలో రూమర్లు కూడా వినిపించాయి. ఇక సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఈ స్టార్‌ కిడ్‌ టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్‌లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే గిల్‌ షేర్‌ చేసే పోస్టులకు లైకులు, ఎమోజీలు, ఫన్నీ కామెంట్లతో సారా స్పందించడం.. గిల్ కూడా అంతే సరదాగా రిప్లైలు ఇస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. అయితే తమ రిలేషన్‌ విషయంపై ఇద్దరూ ఎప్పుడూ నోరు విప్పలేదు.

Also Read:

IND vs SA: దక్షిణాఫ్రికాలో విధ్వంసం సృష్టిస్తోన్న భారత ఫాస్ట్ బౌలర్.. విరాట్ కోహ్లి జట్టులో స్థానం దక్కేనా?

ND vs SA: టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన.. కొత్త షెడ్యూల్‌ విడుదల చేసిన సీఎస్‌ఏ.. పూర్తి వివరాలివే..

Viral Video: ఇదేం ఎంపైరింగ్‌ బాబు.. వైడ్‌ సిగ్నల్‌ను ఇలా కూడా ఇస్తారా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!