Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేం ఎంపైరింగ్‌ బాబు.. వైడ్‌ సిగ్నల్‌ను ఇలా కూడా ఇస్తారా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: క్రికెట్‌ అంటనే అద్భుతాలకు, ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెట్టింది పేరు. బంతికి బంతికి పెరిగే ఉత్కంఠత, ఏ క్షణనా ఏం జరుగుతుందో అన్న ఆసక్తి వెరసి క్రికెట్‌ను చూడడానికి స్క్రీన్లకు అతుక్కుపోతుంటారు...

Viral Video: ఇదేం ఎంపైరింగ్‌ బాబు.. వైడ్‌ సిగ్నల్‌ను ఇలా కూడా ఇస్తారా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..
Viral Photo
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 06, 2021 | 7:54 PM

Viral Video: క్రికెట్‌ అంటేనే అద్భుతాలకు, ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెట్టింది పేరు. బంతికి బంతికి పెరిగే ఉత్కంఠత, ఏ క్షణనా ఏం జరుగుతుందో అన్న ఆసక్తి వెరసి క్రికెట్‌ను చూడడానికి స్క్రీన్లకు అతుక్కుపోతుంటారు. అయితే ఎప్పుడూ సీరియస్‌గా జరిగే ఈ మ్యాచ్‌లో అప్పుడప్పుడు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్‌ కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఎంపైర్‌లు చేసే చిత్ర విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. మనకు తెలిసి ఇలాంటి ఫన్నీ ఎంపైరింగ్‌ చేసే వారిలో న్యూజిలాండ్‌కు చెందిన బిల్లి బౌడెన్‌ మొదటి వరుసలో ఉంటారు. బిల్లి స్టేడియంలో ఉన్నాడంటే ప్రేక్షకులకు మ్యాచ్‌తో పాటు ఇతని విన్యాసాలతో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతాడు.

అయితే తాజాగా దేశీవాలీ క్రికెట్‌లో జరిగిన ఓ సంఘటన బిల్లి బౌడెన్‌ను సైతం వెనక్కి నెట్టేసింది. ఆయన చేసిన విన్యాసాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. తాజాగా మహారాష్ట్ర లోకల్‌ క్రికెట్‌లో పురందర్‌ ప్రీమియం లీగ్‌ పేరుతో ఓ మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో భాగంగా ఎంపైరింగ్ చేసిన వ్యక్తి వైడ్‌ బాల్‌ పడగానే.. వెంటనే తల కింది రెండు కాళ్లు పైకి చేసి.. కాళ్లతో వైడ్‌ సిగ్నల్‌ను చూపించాడు.

దీంతో దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు సెల్‌ ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ఈ ఎంపైర్‌ స్టేడియంలో యోగాను పరిచయం చేశాడు, ఎంపైరింగ్‌కి అప్‌డేట్‌ వెర్షన్‌ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

వైరల్ వీడియో..

Also Read: Tamil Nadu: శశికళ వ్యూహాలకు చెక్.. వెనక్కి తగ్గిన పళని.. అన్నాడీఎంకే సారథిగా పన్నీర్ సెల్వం

Sourav Ganguly: రాహుల్ ద్రవిడ్‎ను ఒప్పించడం అంత సులభం కాలేదు.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ..

స్క్విడ్‌ గేమ్‌ చూసిన వ్యక్తిపై కిమ్‌ దారుణం !! వీడియో