Ajaz Patel: 22 ఏళ్ల తర్వాత మళ్లీ అద్భుతం జరిగింది.. అది ఎవరు చేశారంటే..

ప్రపంచ క్రికెట్ చరిత్రలో 22 ఏళ్లుగా జరగని సంఘటన శనివారం జరిగింది. అంతకు ముందు యాభైలలో అటువంటి ఘనత జరిగింది. టెస్ట్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీసిన ఘనత గురించి మీకు చెబుతున్నాం...

Ajaz Patel: 22 ఏళ్ల తర్వాత మళ్లీ అద్భుతం జరిగింది.. అది ఎవరు చేశారంటే..
ముంబై టెస్టు రెండో రోజు టీమ్ ఇండియా విజయం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసిన టీమిండియా కివీస్‌ను కేవలం 62 పరుగులకే ఆలౌట్ చేసి, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. దీంతో 332 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ టెస్టులో విజయం సాధించడం పక్కా అని తెలుస్తోంది. రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ బ్యాటింగ్ నిరాశపరిచినా దాని స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు.
Follow us

|

Updated on: Dec 06, 2021 | 5:52 PM

ప్రపంచ క్రికెట్ చరిత్రలో 22 ఏళ్లుగా జరగని సంఘటన శనివారం జరిగింది. అంతకు ముందు యాభైలలో అటువంటి ఘనత జరిగింది. టెస్ట్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీసిన ఘనత గురించి మీకు చెబుతున్నాం. ఇంగ్లండ్ ఆటగాడు జిమ్ లేకర్ 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొత్తం పది వికెట్లు తీశాడు. 43 ఏళ్ల తర్వాత 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత ఆటగాడు అనిల్ కుంబ్లే ఈ ఘనతను పునరావృతం చేశాడు. 22 ఏళ్ల తర్వాత డిసెంబర్ 2021లో న్యూజిలాండ్‌కు చెందిన అజాజ్ పటేల్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మాయ చేశాడు. ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం పది మంది భారత బ్యాట్స్‌మెన్లను అవుట్ చేశాడు.

విచారకరంగా అతను ఈ చారిత్రక క్షణాన్ని జరుపుకోలేకపోయాడు. ఎందుకంటే న్యూజిలాండ్ ఓడిపోయింది. రెండున్నర, మూడు గంటల తర్వాత మరోసారి అజాజ్ పటేల్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అతను 4 వికెట్లు పడగొట్టాడు, అయినప్పటికీ అతని జట్టు 372 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 1956లో జిమ్ లేకర్ మొత్తం 10 మంది ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కు పంపినప్పుడు, అతని జట్టు ఇంగ్లాండ్ గెలిచింది. మాంచెస్టర్‌లో జరిగిన ఆ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 170 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో జిమ్ లేకర్ 9 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ‘పర్ఫెక్ట్-10’ని టార్గెట్ చేశాడు. దీని తర్వాత 1999లో అనిల్ కుంబ్లే ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టినప్పుడు, పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది.

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ 212 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే నాలుగు వికెట్లు కూడా పడగొట్టాడు. కానీ అజాజ్ పటేల్ విషయంలో అలా జరగలేదు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన కారణంగా 372 పరుగుల భారీ పరాజయం పాలైంది. న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టెస్ట్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు స్పిన్నర్లే. జిమ్ లేకర్ ఆఫ్ స్పిన్నర్. అనిల్ కుంబ్లే లెగ్ స్పిన్నర్. కాగా, అజాజ్ పటేల్ ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్. అజాజ్ పటేల్ భారతీయ మూలాలున్న ఆటగాడు. చిన్నతనంలో అతను న్యూజిలాండ్‌కు వెళ్లాడు. 2018లో న్యూజిలాండ్‌కు ఆడే అవకాశం లభించింది. 2018లోనే, అతను T20 క్రికెట్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. నవంబర్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2021లో అతనికి ఇది మూడో టెస్టు మ్యాచ్.

Read Also… Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. అన్ని ఫార్మట్లలో 50 విజయాలు సాధించిన ఆటగాడిగా గుర్తింపు..