Sourav Ganguly: రాహుల్ ద్రవిడ్‎ను ఒప్పించడం అంత సులభం కాలేదు.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ..

భారత సీనియర్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమించాలని మేనేజ్‌మెంట్ ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉన్నప్పటికీ, అతనిని ఒప్పించడం అంత సులభం కాలేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ వెల్లడించారు....

Sourav Ganguly: రాహుల్ ద్రవిడ్‎ను ఒప్పించడం అంత సులభం కాలేదు.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ..
నిజానికి, సౌరవ్ గంగూలీ ఏటీకే (ATK) మోహన్ బగాన్ ఫుట్‌బాల్ జట్టు డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్‌లో లక్నో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన ATK మోహన్ బగన్ RPSG యాజమాన్యంలోనే ఉంది.
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 06, 2021 | 5:31 PM

భారత సీనియర్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమించాలని మేనేజ్‌మెంట్ ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉన్నప్పటికీ, అతనిని ఒప్పించడం అంత సులభం కాలేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ వెల్లడించారు. గంగూలీ, BCCI సెక్రటరీ జే షా ఇద్దరూ నిరంతరం అభ్యర్థనలు చేసినప్పటికీ ద్రావిడ్‌ను ఒప్పించడం కష్టమైందన్నారు. ఒకానొక సమయంలో ద్రవిడ్‌ను బోర్డులో చేర్చుకోవాలనే ఆలోచనను దాదాపుగా వదులుకున్నానని గంగూలీ అంగీకరించాడు. ద్రవిడ్ చాలా సమయం ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు.

“”నేను జే షా, చాలా కాలంగా రాహుల్‌ని దృష్టిలో ఉంచుకున్నాము, కానీ అతను ఇంటికి దూరంగా ఉన్నందున జాతీయ జట్టు పని చేయడానికి అతను అంగీకరించలేదు. ఒక సంవత్సరంలో సుమారు 8-9 నెలల పాటు అతను దూరంగా ఉన్నారని, అతనికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.” ”అని గంగూలీ ‘బ్యాక్‌స్టేజ్ విత్ బోరియా’ షోలో బోరియా మజుందార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. “ఒక దశలో మేము ఆశలు వదులుకున్నామని గంగూలీ చెప్పాడు.

ద్రవిడ్‌ను బీసీసీఐ మాత్రమే కాకుండా ఆటగాళ్లు కూడా తనను బోర్డులో చేర్చుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించినట్లు గంగూలీ చెప్పాడు.” నేను అతనితో చాలాసార్లు వ్యక్తిగతంగా మాట్లాడాను. ఇది కష్టమని నాకు తెలుసు. కానీ రెండు సంవత్సరాలు ప్రయత్నించి చూడండి. మీకు చాలా కష్టంగా అనిపిస్తే మేము మరొక మార్గం చూస్తాము. అని చెప్పాం. అదృష్టవశాత్తూ అతను అంగీకరించాడు.” అని గంగూలీ చెప్పాడు.

Read Also.. IND vs NZ: ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‎లో మొదటి స్థానానికి దూసుకెళ్లిన టీంమిండియా.. రెండో స్థానంలో న్యూజిలాండ్..