IND vs NZ: టీమిండియాపై మాజీ ఆటగాళ్ల ప్రశంసలు.. గొప్ప విజయమంటూ ట్వీట్లు..
ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది....
ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఐసీసీ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. మయాంక్ అగర్వాల్ మొదటి ఇన్నింగ్స్ లో 150, రెండో ఇన్నిగ్స్ లో 62 పరుగులు చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ మొదటి ఇన్నిగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీశాడు. టీమిండియా విజయంపై భారత మాజీ ఆటగాళ్లు ట్విట్టర్ ద్వారా స్పందించారు.
“భారత్‌కు వారి సొంత మైదానంలో అద్భుతమైన విజయం సాధించింది. మయాంక్, అశ్విన్ బాగా ఆడారు.” అని భారత మాజీ బ్యాటర్ VVS లక్ష్మణ్ అన్నాడు.
Resounding win for India in their own backyard, comprehensively outclassed New Zealand on a track with turn and bounce. Complete all-round effort with Mayank and Ashwin leading the way, one does feel for history-maker Ajaz. #INDvNZ pic.twitter.com/FFeRu6ZPUC
— VVS Laxman (@VVSLaxman281) December 6, 2021
3
“టీమ్ ఇండియాకు స్వదేశంలో మరో సమగ్ర విజయం. మయాంక్ అగర్వాల్ తిరిగి అత్యుత్తమ ప్రదర్శన చేయడం శుభపరిణామం.” అని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర ట్వీట్ చేశాడు.
Well done Team India. Another comprehensive win at home. Many positives in the test match , but the best was to see Mayank Agarwal back at his best. pic.twitter.com/KrHlRhXngr
— Virender Sehwag (@virendersehwag) December 6, 2021
“వాంఖడేలో ఘనమైన ప్రదర్శన. టెస్ట్ క్రికెట్‌లో అతిపెద్ద విజయం. సిరీస్‌ను గెలిచినందుకు అబ్బాయిలు గర్వపడుతున్నాను” అని రిషబ్ పంత్ తన సహచరులను అభినందించాడు.
A solid performance at the Wankhede. Proud of the boys as they win the game and the series with the biggest our ever victory in Test Cricket, by runs. @BCCI ?? #INDvNZ pic.twitter.com/64d9NmlAkO
— Rishabh Pant (@RishabhPant17) December 6, 2021