సెక్యూరిటీ గార్డు కొడుకు ప్రస్తుతం టీమిండియాలో ట్రెండ్ సెట్టర్.. 3 ట్రిపుల్ సెంచరీలు.. అనూహ్య రికార్డులు!

ప్రస్తుతం టీమిండియా క్రికెట్‌లో ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా.. ఇలా చాలామంది..

Ravi Kiran

|

Updated on: Dec 06, 2021 | 10:01 AM

ప్రస్తుతం టీమిండియా క్రికెట్‌లో ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా.. ఇలా చాలామంది జట్టులో ఉన్నారు. అయితే భారత క్రికెట్ 'రాక్‌స్టార్' ఎవరంటే.. ఠక్కున వచ్చే పేరు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. అవును ఈరోజు జడేజా పుట్టినరోజు.

1 / 8
రవీంద్ర జడేజా 6 డిసెంబర్ 1988న గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నవ్‌గామ్ గీడ్ గ్రామంలో జన్మించాడు. అతడి తండ్రి సెక్యూరిటీ గార్డు, తల్లి నర్సు. జడేజా ఆర్మీలో పెద్ద ఆఫీసర్ కావాలని ఎప్పుడూ తండ్రి కలలు కనేవాడు. కాని అతడు మాత్రం క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. ఆ కలలు నెరవేర్చడానికి అతడి తల్లి ఎంతగానో సహకారం ఇచ్చింది. అయితే అనూహ్యంగా జడేజాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె కన్నుమూశారు. దీనితో క్రికెట్ వదిలేయాలని జడేజా నిర్ణయానికి వచ్చాడు. అయితే అతడి అక్క ప్రోత్సహించింది. తమ్ముడికి అండగా ఉంటూ.. కలలను సాకారం చేసుకోవడంలో సాయంగా నిలిచింది.

2 / 8
 జాతీయ జట్టులోకి అడుగుపెట్టక ముందు జడేజా అండర్-19 స్థాయిలోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో భారతదేశం తరపున రెండుసార్లు ఆడిన అతికొద్ది మంది క్రికెటర్లలో జడేజా ఒకడు. అతడు 2006, 2008 ప్రపంచకప్‌లలో టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించాడు.

3 / 8
2006 దులీప్ ట్రోఫీ ద్వారా రవీంద్ర జడేజా ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర జట్టుతో కెరీర్ ప్రారంభించాడు. అప్పటికీ రవీంద్ర జడేజాకు సరైన గుర్తింపు రాలేదు. కానీ ఐపీఎల్ మొదటి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన జడ్డూ.. అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తద్వారా జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఫిబ్రవరి 2009లో ODIలు, T20లలో టీమిండియాకు అరంగేట్రం చేశాడు.

4 / 8
జడేజా కెరీర్‌ను మలుపు తిప్పింది ఈ రికార్డు. అతడు రంజీ ట్రోఫీలో ఒకే సంవత్సరంలో మూడు ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. మొదటిగా నవంబర్ 2011లో వరుసగా రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన జడేజా.. ఆ తర్వాత 2012 నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా రెండేసి సార్లు ట్రిపుల్ సెంచరీలు బాదాడు. తద్వారా 2012 డిసెంబర్‌లోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

5 / 8
2013లో రవీంద్ర జడేజా వన్డేల్లో నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. 1996లో అనిల్ కుంబ్లే తర్వాత తొలిసారిగా భారత బౌలర్‌కు అగ్రస్థానం దక్కింది. కొంతకాలం తర్వాత అతడు టెస్టుల్లో నంబర్ 1 బౌలర్. అలాగే నంబర్ వన్ ఆల్‌రౌండర్ అయ్యాడు. జడేజా తన 44వ టెస్టు మ్యాచ్‌లోనే 200 వికెట్ల మైలురాయిని టచ్ చేశాడు.

6 / 8
 ఐపీఎల్‌ 2010 సీజన్‌లో రవీంద్ర జడేజా నిషేధానికి గురయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌తో ఒప్పందంలో ఉన్నప్పటికీ, మరో జట్టుతో రహస్యంగా చర్చలు జరిపాడన్న కారణంగా బీసీసీఐ నిషేధం విధించింది. ఆ తర్వాత 2011లో, చెన్నై సూపర్ కింగ్స్ జడేజాను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు జడేజా చెన్నై ఫ్రాంచైజీకి కీలక ఆటగాడిగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా జడేజాను అతడి ఫ్యాన్స్ 'సర్ జడేజా' అంటూ పిలుచుకుంటారు.

7 / 8
రవీంద్ర జడేజా ప్రస్తుతం టీమ్ ఇండియా‌లో 'మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్'. అతడు ఇప్పటివరకు టీమిండియా తరపున 57 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 33.76 సగటుతో 2195 పరుగులు (1 సెంచరీ, 17 అర్ధ సెంచరీలు) చేశాడు. అలాగే బౌలింగ్‌లో 24.84 సగటుతో 232 వికెట్లు తీసుకున్నాడు. అదే సమయంలో, జడ్డూ 168 వన్డేల్లో 2411 పరుగులు (13 అర్ధ సెంచరీలు, 32.58 సగటు), 188 వికెట్లు (37.36 సగటు) తీసుకున్నాడు. ఇక 55 T20Iలు ఆడిన జడేజా.. 256 పరుగులు (17 సగటు, 113 స్ట్రైక్ రేట్), 46 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

8 / 8
Follow us
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్

NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్

కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్

ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!

జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..

ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని

దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??

కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు

RRR రికార్డు బ్రేకయ్యేలా ఉందిగా.. పుష్ప 2 రన్ టైమ్ ఎంతంటే?