AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. అన్ని ఫార్మట్లలో 50 విజయాలు సాధించిన ఆటగాడిగా గుర్తింపు..

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతి ఫార్మాట్‌లో 50 అంతర్జాతీయ విజయాలు నమోదు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు....

Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. అన్ని ఫార్మట్లలో 50 విజయాలు సాధించిన ఆటగాడిగా గుర్తింపు..
India Vs New Zealand Team India Skipper Virat Kohli (1)
Srinivas Chekkilla
|

Updated on: Dec 06, 2021 | 1:39 PM

Share

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతి ఫార్మాట్‌లో 50 అంతర్జాతీయ విజయాలు నమోదు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. సోమవారం వాంఖడే స్టేడియంలో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోని రెండో టెస్టులో భారత్ 372 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన తర్వాత కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ విజయంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా మళ్లీ నంబర్ 1 స్థానానికి చేరుకుంది.

న్యూజిలాండ్‌పై విజయంతో భారత్ 1-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఇప్పుడు కోహ్లీ సేన డిసెంబర్ 26 నుంచి మూడు టెస్టులు, మూడు ODIల కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. 140/5 వద్ద 4వ రోజును ఆటను ప్రారంభించిన కివీస్ కొద్ది సేపటికే అలౌట్ అయింది. ఓవర్‌నైట్ బ్యాటర్‌లు రచిన్ రవీంద్ర (18), హెన్రీ నికోల్స్ టోటల్‌కి కేవలం 22 పరుగులు జోడించారు. జయంత్ యాదవ్ కైల్ జామీసన్ మరియు టిమ్ సౌథీలను అవుట్ చేశాడు. చివరి రెండు వికెట్లు కూడా త్వరితగతిన పడిపోయాయి. చివరికి న్యూజిలాండ్ 167 పరుగులకే ఆలౌటైంది.

ఈ టెస్ట్‌లో కోహ్లీ సేన ఏకంగా 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. 540 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో నిన్న ఆట ఆఖరికి 140 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకొని ఓటమి దిశగా పయనించింది. ఇవాళ బ్యాటింగ్‌కు దిగిన వెంటనే కివీస్‌ కేవలం కేవలం 27 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్లు అశ్విన్, జయంత్ నాలుగేసి వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచారు. నికోల్స్ (44) మాత్రమే భారత బౌలర్లను ప్రతిఘటించాడు.

Read Also.. Ind vs NZ 2nd Test Match: సిరీస్ మనదే.. ముంబయి టెస్ట్‌లో అదరగొట్టిన కోహ్లీ సేన..