AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs NZ 2nd Test Match: సిరీస్ మనదే.. ముంబయి టెస్ట్‌లో అదరగొట్టిన కోహ్లీ సేన..

మొదటి టెస్ట్‌లో చేజారిన విజయాన్ని రెండో టెస్ట్‌లో టీమిండియా ఒడిసిపట్టుకుంది.  ముంబై టెస్టులో ఘన విజయం సాధించి 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Ind vs NZ 2nd Test Match: సిరీస్ మనదే.. ముంబయి టెస్ట్‌లో అదరగొట్టిన కోహ్లీ సేన..
India Vs New Zealand 2nd Test Mumbai
Basha Shek
|

Updated on: Dec 06, 2021 | 11:03 AM

Share

మొదటి టెస్ట్‌లో చేజారిన విజయాన్ని రెండో టెస్ట్‌లో టీమిండియా ఒడిసిపట్టుకుంది.  ముంబై టెస్టులో ఘన విజయం సాధించి 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ టెస్ట్‌లో కోహ్లీ సేన ఏకంగా 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. 540 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో నిన్న ఆట ఆఖరికి 140 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకొని ఓటమి దిశగా పయనించింది. ఇవాళ బ్యాటింగ్‌కు దిగిన వెంటనే కివీస్‌ కేవలం కేవలం 27 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది.  స్పిన్నర్లు అశ్విన్, జయంత్ లు నాలుగేసి వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచారు. నికోల్స్ (44) మాత్రమే భారత బౌలర్లను ప్రతిఘటించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్  మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులకు  ఆలౌటైంది.  కివీస్ స్పిన్నర్ 10 వికెట్లతో రికార్డు ప్రదర్శన చేశాడు. ఆతర్వాత బ్యాటింగ్ కు దిగిన కివీస్ టీమిండియా బౌలర్ల ధాటికి 62 పరుగులకే కుప్పకూలింది. అయితే కివీస్ కు ఫాలోఆన్ ఇవ్వకుండా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్  276/7  స్కోరును డిక్లేర్ చేసింది.  540 పరుగుల భారీ లక్యంతో మూడో రోజు  మధ్యాహ్నం రెండో ఇన్నింగ్స్  ప్రారంభించిన న్యూజిలాండ్ ఆరంభంలోనే తడబడింది. వరసగా వికెట్లు కోల్పోయింది. అయితే లాథమ్, విల్ యంగ్, రాస్ టేలర్, టామ్ బ్లండెల్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే డెరిల్ మిచెల్, నికోల్ కాస్త ప్రతిఘటించడంతో ఆట  నాలుగో రోజుకు చేరుకుంది.  అయితే సోమవారం టీమిండియా బౌలర్ల ముందు కివీస్ ఆటలు సాగలేదు.   140/5  ఓవర్ నైట్ స్కోరుతో నాలుగోరోజు ను ప్రారంభించిన కివీస్ ను టీమిండియా స్పిన్నర్లుముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా జయంత్ యాదవ్ మాయాజాలం ముందు న్యూజిలాండ్ నిలవలేకపోయింది.  కేవలం గంటల్లోనే మిగతా ఐదు వికెట్లను కోల్పోయి భారీ పరాజయాన్ని మూట గట్టుకుంది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. కాన్పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.