Ind vs NZ 2nd Test Day 4 Highlights: ముంబయి టెస్ట్ లో మురిసిన భారత్.. 372 పరుగుల తేడాతో ఘన విజయం..
మిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో రోజు ఆట మొదలైంది. 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భాగంగా ఓవర్‌నైట్ స్కోరు 140/5 తో కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రచిన్ రవీంద్ర, హెన్రీ నికోల్స్ క్రీజ్‌లోకి అడుగుపెట్టారు.
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో రోజు ఆట మొదలైంది. 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భాగంగా ఓవర్‌నైట్ స్కోరు 140/5 తో కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రచిన్ రవీంద్ర, హెన్రీ నికోల్స్ క్రీజ్‌లోకి అడుగుపెట్టారు. కాగా మొదటి ఓవర్‌లోనే జయంత్ యాదవ్‌ను బౌలింగ్‌కు దింపిన కెప్టెన్ కోహ్లీ..ఆ తర్వాతి ఓవర్‌ను అశ్విన్‌కు అప్పగించాడు. దీంతో కివీస్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. వీలైనంత వరకు వికెట్ కాపాడుకునేందుకే ప్రయత్నించారు. అయితే జయంత్ వేసిన 51.5 ఓవర్‌లో పూజారా చేతికి చిక్కాడు రచిన్ రవీంద్ర. కాగా ప్రస్తుతంన్యూజిలాండ్ స్కోరు 52 ఓవర్లలో 162/6 గా ఉంది.
కాగా ఈ టెస్ట్‌లో న్యూజిలాండ్ విజయం సాధించాలంటే కివీస్ 540 పరుగుల టార్గెట్‌ను అందుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఐదుగురు కీలక ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరుకున్నారు. సీనియర్ బ్యాటర్ రాస్ టేలర్(6) తో సహా టామ్ లాథమ్ (6), విల్ యంగ్(20), టామ్ బ్లండెల్(0), డెరిల్ మిచెల్(60) రచిన్ రవీంద్ర (18) అవుటయ్యారు. హెన్రీ నికోల్స్(42) మాత్రమే టీమిండియా బౌలర్లను ప్రతిఘటిస్తూ క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. అతనికి తోడుగా కైల్ జేమీసన్ ఉన్నాడు. టీమిండియా బౌలర్ల దూకుడు చూస్తుంటే నాలుగో రోజు మధ్యాహ్నానికే టెస్ట్ ముగిసేలా కనిపిస్తోంది.
LIVE Cricket Score & Updates
ముంబయి టెస్ట్ లో మురిసిన భారత్.. 372 పరుగుల తేడాతో ఘన విజయం..
ముంబయి వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా ఘనవిజయం సాధించంది. ఏకంగా 372 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగరవేసింది. 140/5 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ కేవలం 27 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్లు అశ్విన్, జయంత్ లు నాలుగేసి వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచారు. నికోల్స్ (44) మాత్రమే భారత బౌలర్లను ప్రతిఘటించాడు.
కివీస్ ను తిప్పేస్తోన్న జయంత్.. ఒకే ఓవర్ లో రెండు వికెట్లు.. విజయానికి చేరువలో టీమిండియా..
టీమిండియా స్పిన్నర్ జయంత్ యాదవ్ కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. నాలుగో రోజు ఆట మొదలు కాగానే రచిన్ రవీంద్రను ఔట్ చేసిన అతను 54 ఓవర్లలో ఏకంగా రెండు వికెట్లు తీశాడు. 54 ఓవర్ రెండో బంతికి జేమీసన్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న జయంత్.. నాలుగో బంతితో ఏకంగా ఏకంగా సౌథీ వికెట్లను గిరాటేశాడు. దీంతో విజయానికి 2 వికెట్ల దూరంలో నిలిచింది టీమిండియా.
Published On - Dec 06,2021 10:03 AM