IND vs SA: టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన.. కొత్త షెడ్యూల్ విడుదల చేసిన సీఎస్‌ఏ.. పూర్తి వివరాలివే..
ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో సందిగ్ధంలో పడిన టీమిండియా సౌతాఫ్రికా పర్యటన ఎట్టకేలకు ఖరారైన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల భద్రతకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు హామీ ఇవ్వడంతో టీమిండియా క్రికెటర్లు సౌతాఫ్రికా విమానం ఎక్కేందుకు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది
ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో సందిగ్ధంలో పడిన టీమిండియా సౌతాఫ్రికా పర్యటన ఎట్టకేలకు ఖరారైన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల భద్రతకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు హామీ ఇవ్వడంతో టీమిండియా క్రికెటర్లు సౌతాఫ్రికా విమానం ఎక్కేందుకు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈక్రమంలో స్వదేశంలో వరల్డ్ టెస్ట్ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో సౌతాఫ్రికా వెళ్లనుంది టీమిండియా. పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ముందుగా నిర్ణయించినట్లుగా డిసెంబరు 17 నుంచి కాకుండా.. డిసెంబరు 26 నుంచి బాక్సింగ్ డే టెస్ట్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. కాగా షెడ్యూల్‌లో ముందుగా ప్రకటించిన నాలుగు మ్యాచ్‌ల టీ 20 సిరీస్ ప్రస్తుతానికి వాయిదా పడింది. కొత్త ఏడాదిలో టీ20 సిరీస్‌ను నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సీఎస్‌ఏ పేర్కొంది.
బాక్సింగ్ డే టెస్టుతో ఆరంభం.. టీమిండియా- దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్.. మొదటి టెస్ట్ మ్యాచ్- డిసెంబరు 26-30- సూపర్ స్పోర్ట్ పార్క్- సెంచూరియన్ రెండో టెస్ట్ – జనవరి 03-07- ఇంపీరియల్ వాండరర్స్- జొహన్నెస్‌బర్గ్ మూడో టెస్ట్- జనవరి 11-15- సిక్స్ గన్ గ్రిల్ న్యూలాండ్స్- కేప్‌టౌన్
వన్డే సిరీస్ మొదటి వన్డే -జనవరి 19- యూరోలక్స్ బోల్యాండ్ పార్క్- పర్ల్ రెండో వన్డే- జనవరి 21-యూరోలక్స్ బోల్యాండ్ పార్క్- పర్ల్ మూడో వన్డే – జనవరి 23- సిక్స్ గన్ గ్రిల్ న్యూలాండ్స్- కేప్‌టౌన్
UPDATED SCHEDULE ?
The dates for the upcoming #SAvIND tour have been revised. The tour has been reduced to 3️⃣ Betway Tests and 3️⃣ Betway ODIs
Full list of fixtures ➡️ https://t.co/ZCJDr7nsXL#BetwayTestSeries #BetwayODISeries #BePartOfIt pic.twitter.com/KWrZ0GuUzB
— Cricket South Africa (@OfficialCSA) December 6, 2021
Also Read:
IND vs NZ: టీమిండియాపై మాజీ ఆటగాళ్ల ప్రశంసలు.. గొప్ప విజయమంటూ ట్వీట్లు..
Ind vs NZ 2nd Test Match: సిరీస్ మనదే.. ముంబయి టెస్ట్‌లో అదరగొట్టిన కోహ్లీ సేన..