Watch Video: ఓ ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం ఎలా.. అజాజ్ ఆన్సర్‌కు భారత స్టార్ బౌలర్ ఫిదా.. స్పెషల్ గిఫ్ట్ చూసి షాకైన కీవీ ప్లేయర్
Ashwin-Ajaz Patel: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 372 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా..
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 372 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. అయితే న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఆటతీరు అశ్విన్‌ను ఆకట్టుకుంది. ముంబై టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో అజాజ్ మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌లో 14 వికెట్లు, సిరీస్‌లో 17 వికెట్లు తీశాడు. ముంబై టెస్ట్ ముగిసిన తర్వాత, అశ్విన్ స్వయంగా అజాజ్‌ను ఇంటర్వ్యూ చేసి, అతనికి టీమ్ ఇండియా స్టార్ల ఆటోగ్రాఫ్‌లతో కూడిన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు.
ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయాలంటే ఏం చేయాలి.. అశ్విన్ ఇంటర్వ్యూలో అజాజ్‌ని ఈ ప్రశ్నను సంధించాడు. ‘నేను చాలా సంవత్సరాలుగా ఆడుతున్నాను. కానీ, ఒక టెస్టులో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయం వీలుకాలేదు. ఈ రికార్డుకు ఎప్పుడూ దూరంగానే నిలిచాను. మీరు ఈ ఘనతను సాధించారు. జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచారు. నేను కూడా ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయాలంటే ఏం చేయాలో చెప్పండి’ అంటూ ప్రశ్నలు సంధించాడు. దీనిపై అజాజ్ స్పందిస్తూ.. ‘నువ్వు నాకంటే అనుభవజ్ఞుడివి. నేను నెమ్మదిస్తే భారత బ్యాట్స్‌మెన్ పట్టు వదలరని నాకు తెలుసు. వారు స్పిన్‌పై చాలా దూకుడుగా ఉంటారు. కాబట్టి సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయడమే నా ప్రయత్నం. దీంతో 10 వికెట్లు దక్కాయి’ అని పేర్కొన్నాడు.
ఫాస్ట్ బౌలర్ నుంచి స్పిన్నర్‌గా ఎలా మారారు, భారత దేశంతో మీ సంబంధం ఎలా అంటూ మరో ప్రశ్నలు అడిగాడు. అండర్-19 స్థాయి వరకు అజాజ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. తర్వాత స్పిన్నర్‌గా మారాడు. దీనిపై అజాజ్ స్పందిస్తూ- ఫాస్ట్ బౌలర్‌గా మారడానికి నా ఎత్తు సరిపోదని గ్రహించాను. కాబట్టి నేను కొత్త నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాను. భారత్‌లో ప్రత్యేకంగా వాంఖడేలో ఆడే అవకాశం లభించినందుకు, చరిత్ర సృష్టించినందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపాడు.
‘మేం న్యూజిలాండ్‌కు వెళ్లి ఉండవచ్చు. కానీ, మా కుటుంబంలో క్రికెట్ పట్ల ప్రేమ భారతీయ కుటుంబంలో ఎలా ఉంటుందో అలాగే ఉంది. మేం మా పెరట్లో ఎప్పుడూ క్రికెట్ ఆడతుంటాం. ఇంట్లో అందరికీ క్రికెట్ అంటే పిచ్చి. ఈ క్రేజ్‌తోనే క్రికెట్‌లో కెరీర్‌ను కొనసాగించడానికి సహాయపడింది’ అని తెలిపాడు.
ఇంటర్వ్యూ ముగిశాక అశ్విన్ భారత స్టార్లు సంతకం చేసిన జెర్సీని అజాజ్‌కి ఇచ్చాడు. దీనిపై అజాజ్ మాట్లాడుతూ – ‘ ఇది అస్సలు ఊహించలేదు. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఈ స్పెషల్ బహుమతికి ధన్వవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు.
Special Mumbai connect ? Secret behind 10-wicket haul ? A memorable #TeamIndia souvenir ☺️
? @ashwinravi99 interviews Mr Perfect 10 @AjazP at the Wankhede ? #INDvNZ @Paytm
Watch this special by @28anand ? ?https://t.co/8fBpJ27xqj pic.twitter.com/gyrLLBcCBM
— BCCI (@BCCI) December 6, 2021