AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: శశికళ వ్యూహాలకు చెక్.. వెనక్కి తగ్గిన పళని.. అన్నాడీఎంకే సారథిగా పన్నీర్ సెల్వం

తమిళనాడు అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు విఫలయత్నం చేస్తున్న శశికళ వ్యూహాలకు చెక్‌ పెడుతూ..

Tamil Nadu: శశికళ వ్యూహాలకు చెక్.. వెనక్కి తగ్గిన పళని.. అన్నాడీఎంకే సారథిగా పన్నీర్ సెల్వం
Panneerselvam And Palaniswami
Janardhan Veluru
|

Updated on: Dec 06, 2021 | 6:34 PM

Share

తమిళనాడు అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు విఫలయత్నం చేస్తున్న శశికళ వ్యూహాలకు చెక్‌ పెడుతూ.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి చేతులు కలిపారు. ఇద్దరి మధ్య కుదిరిన రాజీ మేరకు అనూహ్యంగా అన్నాడీఎంకే సారథ్య పగ్గాలు పన్నీర్‌సెల్వంకు దక్కాయి. పార్టీ సమయ్వయ కర్తగా పన్నీర్‌సెల్వం , ఉప సమన్వయకర్తగా పళనిస్వామి ఏక్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారమే ఇద్దరికి ఈ పదవులు దక్కాయి. అసెంబ్లీలో విపక్ష నేతగా వ్యవహరిస్తున్న పళనిస్వామి.. పార్టీ సారథ్య పగ్గాలను పన్నీర్‌సెల్వంకు అప్పగించారు.

అన్నాడీఎంకేను తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు శశికళ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు తెరచాటు ప్రయత్నాలతో పాటు.. బహిరంగంగానూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని పన్నీర్ సెల్వం, పళని స్వామి నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పార్టీ సమన్వయ కర్తగా పన్నీర్ సెల్వం ఉండేందుకు పళనిస్వామి ఒప్పుకున్నారు. పార్టీ ఎన్నికలకు ముందే ఆ మేరకు వారిద్దరి మధ్య రాజీ కుదిరింది. శశికళను పార్టీలోకి రానివ్వొద్దనే డిమాండ్‌తో పార్టీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకునేందుకు పళనిస్వామి ఒప్పుకున్నారు. పార్టీ పగ్గాలు పన్నీర్‌సెల్వంకు ఇచ్చేందుకు పళనిస్వామి ఒప్పుకోగా…అన్నాడీఎంకే డిప్యూటీ చీఫ్‌గా పళనిస్వామి ఉండనున్నారు. ఆ మేరకు పార్టీ సమన్వయ కర్తగా పన్నీర్ సెల్వం.. పార్టీ ఉప సమన్వయకర్తగా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అన్నాడీఎంకేలో పరిణామాలపై శశికళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అన్నాడీఎంకే లోకి రాకుండా తనను ఎవరు అడ్డుకోలేరని అన్నారు. పార్టీ రాజ్యాంగాన్ని పన్నీర్‌-పళని ద్వయం మార్చడంపై ఆమె మండిపడుతున్నారు.

Also Read..

Vizag: మహిషాసుర మర్దినిలా మారిన మహిళలు.. రౌడీషీటర్‌‌‌‌‌‌‌‌ను రక్తం వచ్చేలా కొట్టారు.. ఎందుకంటే

PM Modi Putin Summit: పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ.. రక్షణ, వాణిజ్య రంగాల్లో ఒప్పందాలు