AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Putin Summit: పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ.. రక్షణ, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు

PM Narendra Modi - Vladimir Putin Summit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ఇద్దరు నేతల మధ్య ద్వైపాక్షిక

PM Modi Putin Summit: పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ.. రక్షణ, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు
Pm Modi Putin Summit
Shaik Madar Saheb
|

Updated on: Dec 06, 2021 | 6:33 PM

Share

PM Narendra Modi – Vladimir Putin Summit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ఇద్దరు నేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతున్నాయి. రక్షణ, వాణిజ్య , టెక్నాలజీ రంగాల్లో పలు ఒప్పందాలపై ఇరుదేశాల నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ సంతకాలు చేశారు. కోవిడ్‌ నుంచి ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశం-రష్యా సంబంధాల వృద్ధి వేగంలో ఎటువంటి మార్పు ఉండదని ఇరుదేశాలు ప్రకటించాయి. తమ ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టంగా కొనసాగుతోందంటూ భారత్‌, రష్యా ప్రకటించాయి. ఈ భేటీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత కొన్ని దశాబ్దాలలో ప్రపంచం అనేక మార్పులను చూసిందని.. వివిధ రకాల భౌగోళిక రాజకీయ సమీకరణాలు ఉద్భవించాయని పేర్కొన్నారు. అయితే భారతదేశం, రష్యాల స్నేహం స్థిరంగా ఉందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, రష్యా మధ్య సంబంధం అంతర్జాతీయ స్నేహానికి ఒక ప్రత్యేక నమూనా అంటూ నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

భారత్‌తో 5 బిలియన్‌ డాలర్ల డిఫెన్స్‌ డీల్‌పై చర్చలు జరిపారు పుతిన్‌. ఎల్‌ఏసీ దగ్గర చైనా దురాక్రమణపై కూడా ఇరు దేశాల నేతలు చర్చల్లో ప్రస్తావించారు. కరోనాపై భారత్‌ – రష్యా కలిసి పోరాటం చేశాయని మోదీ, పుతిన్‌ పేర్కొన్నారు. 74 ఏళ్ల నుంచి భారత్‌-రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయని.. రష్యాతో స్నేహం నిరంతరం కొనసాగుతుందని  ప్రధాని మోదీ స్పష్టంచేశారు.

పర్యటనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. అయితే.. రెండేళ్ల తర్వాత మోడీ, పుతిన్‌ ప్రత్యక్షంగా కలుసుకున్నారు. 21వ వార్షిక భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో మోదీ – పుతిన్‌ రక్షణ, వాణిజ్య, టెక్నాలజీ, సాంస్కృతిక రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. రూ.5,124 కోట్లతో భారత్‌లో 6 లక్షల కలష్నికోవ్‌ ఏకే-203 రైఫిళ్ల తయారీ, స్వల్ప దూరంలోని శత్రు లక్ష్యాల నాశనం కోసం రష్యా నుంచి రూ.11,262 కోట్లతో గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ రష్యా మధ్య ఒప్పందాలు జరిగాయి. కనుచూపుమేరలోని శత్రు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చివేయడానికి ఉపకరించే ఇగ్లా-ఎస్‌ విమాన విధ్వంసక క్షిపణులనూ రష్యా నుంచి భారత్ సమీకరించనుంది.

భుజం మీద నుంచి ప్రయోగించే ఇగ్లా-ఎస్‌ క్షిపణి తయారీ, పలు అంశాలపై చర్చించారు. భారత్, రష్యా సైనిక దళాలు మరింత తరచుగా, ఉన్నత స్థాయిలో సంయుక్త విన్యాసాలు జరిపే విషయంలోనూ మోడీ పుతిన్ భేటీలో అంగీకారం కుదిరే అవకాశం ఉంది. రష్యా నుంచి రూ.40 వేల కోట్లతో భారత్‌ కొనుగోలు చేసిన ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థల బట్వాడా ప్రక్రియను వేగవంతం చేయడానికి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

Also Read:

Rajnath Singh: రష్యా మంత్రులతో సమావేశంలో చైనా చొరబాట్ల అంశం.. సరిహద్దుల్లో ఆక్రమణలపై కఠినంగా మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Modi-Putin: నేడు భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ప్రధాని మోడీతో కీలక భేటీ.. పలు కీలక ఒప్పందాలపై సంతకాలు.!

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..