AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajnath Singh: రష్యా మంత్రులతో సమావేశంలో చైనా చొరబాట్ల అంశం.. సరిహద్దుల్లో ఆక్రమణలపై కఠినంగా మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా మంత్రులతో జరిగిన సమావేశంలో చైనా చొరబాటు అంశాన్ని లేవనెత్తారు. వాస్తవానికి, 2020 సంవత్సరంలో చైనా భారత్ లోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేసిన తర్వాత, భారతదేశం, దాని ఉత్తర పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిపోయింది.

Rajnath Singh: రష్యా మంత్రులతో సమావేశంలో చైనా చొరబాట్ల అంశం.. సరిహద్దుల్లో ఆక్రమణలపై కఠినంగా మాట్లాడిన రక్షణ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh
KVD Varma
|

Updated on: Dec 06, 2021 | 3:06 PM

Share

Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా మంత్రులతో జరిగిన సమావేశంలో చైనా చొరబాటు అంశాన్ని లేవనెత్తారు. వాస్తవానికి, 2020 సంవత్సరంలో చైనా భారత్ లోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేసిన తర్వాత, భారతదేశం, దాని ఉత్తర పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిపోయింది. భారత్-చైనా రెండు దేశాల మధ్య అనుమానాలు, స్పర్ధలు అనే అంతరం పెరుగుతోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపధ్యంలో రష్యా విదేశాంగ, రక్షణ మంత్రులతో చైనా చొరబాటు అంశాన్ని లేవనెత్తిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీరు చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. .

1962 చైనా-ఇండియా యుద్ధంలో వైఫల్యాన్ని ఎదుర్కొన్న భారత సైన్యం ఇటీవలి సంవత్సరాలలో అనేక సందర్భాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)తో ముఖాముఖిగా వచ్చింది. 1962లో చైనాతో పోరాడిన తర్వాత భారత్ ఎంతో ముందుకు వచ్చిందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఆదివారం అన్నారు. ఈ రోజు దేశం తన శత్రువులకు అన్ని రంగాలలో తగిన సమాధానం ఇవ్వగలదు. నీరు, భూమి, గాలిలో దేశంలోని ప్రతి మూలను సమర్థవంతంగా రక్షించినట్లు భట్ చెప్పారు. ఏ దేశం పేరు చెప్పకుండానే, ‘ప్రతి రంగంలో శత్రువులకు తగిన సమాధానం చెప్పగల సామర్థ్యం మాకు ఉంది’ అని అన్నారు.

రష్యా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు

రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని సుష్మాస్వరాజ్ భవన్‌లో ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. సమాచారం ప్రకారం, చర్చించిన అంశాలలో మొత్తం ఐదు S400 క్షిపణుల సకాలంలో సరఫరా, తదుపరి రెండు S400ల విస్తరణలో రష్యా ద్వారా సమర్థవంతమైన సహాయాన్ని అందించడం వంటివి ఉన్నాయి.

పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు

దీంతో పాటు ఏకే 203 డీల్‌ను ఖరారు చేసేందుకు కూడా చర్చలు జరిగాయి. భేటీ అనంతరం రాజ్‌నాథ్‌సింగ్‌, సెర్గీ షోయిగులు భారత్‌, రష్యాల మధ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారతదేశం, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాలలో ఇండో-రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మొత్తం 6,01,427 7.63×39mm అస్సాల్ట్ రైఫిల్స్ AK-203 కొనుగోలుకు ఒప్పందం ఉంది. ఇండియా-రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రోగ్రామ్ అనేది 2021-2031 వరకు సైనిక-సాంకేతిక సహకార కార్యక్రమం.

Also Read: Home Loan Tips: సొంతిల్లు కొనాలకుంటున్నారా.. తక్కువ వడ్డీతో హోమ్ లోన్ అందించే బ్యాంకులు ఇవే!

Income Tax Refund: ఐటీఆర్‌లో ‘నామినీ’ని చేర్చడం అవసరమా.. చట్టం ఏం చెబుతుందంటే?