AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: సిరివెన్నెల రాసిన చివరి పాట.. శ్యామ్ సింగరాయ్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఎప్పుడంటే..

న్యాచులర్ స్టార్ నాని ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. నాని నటిస్తున్న లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్

Shyam Singha Roy: సిరివెన్నెల రాసిన చివరి పాట.. శ్యామ్ సింగరాయ్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. ఎప్పుడంటే..
Shyam Singha Roy
Rajitha Chanti
|

Updated on: Dec 07, 2021 | 8:43 AM

Share

న్యాచులర్ స్టార్ నాని ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. నాని నటిస్తున్న లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ శ్యామ్ సింగరాయ్ చిత్రంపై హైప్ క్రియేట్ చేశాయి.

ఇందులో నాని సరసన సాయి పల్లవి, కృతిక శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇందులో నాని డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. డిసెంబర్ 7న అంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు సిరివెన్నెల రాసిన చివరి పాటను చిత్రయూనిట్ విడుదల చేయబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాని, సాయి పల్లవి ఆకట్టుకున్నారు. నాని తన మీసాన్ని తిప్పుతూ ఉంటే.. సాయి పల్లవి మాత్రం సిగ్గుపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాకు నాని, సాయి పల్లవి మధ్య వచ్చే ప్రేమ కథ అతి పెద్ద బలంగా మారుతుందనిపిస్తోంది.

‘సిరివెన్నెల’ పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సాంగ్ ప్రోమోను ఇది వరకే విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఇక పూర్తి సాంగ్ ఈరోజు సాయంత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

ట్వీట్..

Also Read: Upasana & Samantha: ఎంతో విలువైనది..వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయంటూ ఉపాసన ఎమోషనల్.. సమంత రియాక్షన్..

Follow Us
చాలా మంది చేసేది ఇదేనట.. అందుకే ప్రయాణికులకు షాకిచ్చే కొత్త రూల్
చాలా మంది చేసేది ఇదేనట.. అందుకే ప్రయాణికులకు షాకిచ్చే కొత్త రూల్
శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?
శ్రావణంలో వీరి ఇంట శుభకార్యాల వెల్లువ! మీ రాశి ఉందా?
తలనొప్పికి తమలపాకు మంత్రం.. ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యలకు చెక్!
తలనొప్పికి తమలపాకు మంత్రం.. ఒత్తిడి, జీర్ణక్రియ సమస్యలకు చెక్!
100 ఏళ్లు దాటినా ముసలితనం రాదు.. అపాయం వస్తే తప్ప చావు లేదు!
100 ఏళ్లు దాటినా ముసలితనం రాదు.. అపాయం వస్తే తప్ప చావు లేదు!
మంగళవారం కొత్త బట్టలు ఎందుకు ధరించకూడదని చెబుతారు? జ్యోతిష్య..
మంగళవారం కొత్త బట్టలు ఎందుకు ధరించకూడదని చెబుతారు? జ్యోతిష్య..
నెలవారీ కేబుల్‌, డీటీహెచ్‌ ఛార్జీలు 6 రెట్లు పెరగనున్నాయా?
నెలవారీ కేబుల్‌, డీటీహెచ్‌ ఛార్జీలు 6 రెట్లు పెరగనున్నాయా?
రైల్వేలో మిడిల్ బెర్త్‌పై కొత్త రూల్స్ ఇవే!
రైల్వేలో మిడిల్ బెర్త్‌పై కొత్త రూల్స్ ఇవే!
శుక్ర యోగంతో వారి జీవిత భాగస్వామికి మహర్దశ..!
శుక్ర యోగంతో వారి జీవిత భాగస్వామికి మహర్దశ..!
జలంలో వెలసిన జగన్మాత.. భక్తులను కాపాడే బల్కంపేట ఎల్లమ్మ తల్లి..
జలంలో వెలసిన జగన్మాత.. భక్తులను కాపాడే బల్కంపేట ఎల్లమ్మ తల్లి..
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు