Upasana & Samantha: ఎంతో విలువైనది..వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయంటూ ఉపాసన ఎమోషనల్.. సమంత రియాక్షన్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు అపోలో ఆసుపత్రి బాధ్యతలను

Upasana & Samantha: ఎంతో విలువైనది..వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయంటూ ఉపాసన ఎమోషనల్.. సమంత రియాక్షన్..
Upasana
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2021 | 8:29 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు అపోలో ఆసుపత్రి బాధ్యతలను చేపడుతూ.. మరోవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ ఉపాసన ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటారు.. ఫిట్‏నెస్ గురించి.. ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ.. వీడియోస్ షేర్ చేస్తుంటారు. అలాగే ఆహారపు అలవాట్లు.. హెల్త్ ఫుడ్ వంటి వీడియోలను సైతం షేర్ చేస్తుంటారు.

ఇక ప్రస్తుతం ఉపాసన సోదరి అనుష్పాల పెళ్లి వేడుకలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తున్నారు ఉపాసన. దోమకొండ గడికోటలో అనుష్పా పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ సైతం హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఉపాసన తన సోదరి పెళ్లి వేడుకలలో తన వివాహా విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోచమ్మ గుడికి వెళ్లినప్పుడు ధరించిన దుస్తులను గుర్తుచేసుకున్నారు. తొమ్మిదేళ్ల క్రితం తన పెళ్లి వేడుకలలో పోచమ్మ పండగ సెలెబ్రెషన్స్‏లో వేసుకున్న దుస్తులను రీక్రియేట్ చేసి ఇప్పుడు తన సోదరి పెళ్లి వేడుకలలో మళ్లీ పోచమ్మ పండుగకు వేసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది ఉపాసన.

దుస్తులను వేసుకోవడం.. వాటిని జాగ్రత్తగా భద్రపరచడం నాకు ఎంతో ఇష్టం. అందులో నాకు గర్వంగా ఉంటుంది. క్వాలిటీ ఉన్న వస్త్రాలను షాపింగ్ చేయడం నాకు ఇష్టం. దుస్తులతో వెలకట్టలేని ఎమోషన్స్ ఉంటాయి. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత దోమకొండలో నా పెళ్లికి సంబంధించిన పోచమ్మ పండగ సెలబ్రేషన్స్ దుస్తులను రీక్రియేట్ చేసినందుకు అనామిక ఖన్నాకు థ్యాంక్ అంటూ ప్రస్తుత ఫోటోలతోపాటు.. తన పెళ్లి ఫోటోలను షేర్ చేసుకుంది ఉపాసన. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఉపాసన పోస్ట్‏కు హీరోయిన్ సమంత బ్యూటీఫుల్ అంటూ రియాక్షన్ ఇచ్చింది.

Also Read: Kevvu Karthik: కెవ్వు కార్తీక్ కేక పుట్టించాడు.. వెండితెరపై కమల్ హాసన్, బుల్లితెరపై కార్తీక్..

Bigg Boss 5 Telugu: సన్నీ, సిరి మధ్య లవ్ ట్రాక్.. కోపంతో రెచ్చిపోయిన షణ్ముఖ్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!