Kevvu Karthik: కెవ్వు కార్తీక్ కేక పుట్టించాడు.. వెండితెరపై కమల్ హాసన్, బుల్లితెరపై కార్తీక్..

జబర్థస్త్ కామెడీ షో.. గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ టాప్ స్థానంలో దూసుకుపోతుంది. ఈ కామెడీ

Kevvu Karthik: కెవ్వు కార్తీక్ కేక పుట్టించాడు.. వెండితెరపై కమల్ హాసన్, బుల్లితెరపై కార్తీక్..
Kevvu Karthik
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2021 | 7:36 AM

జబర్థస్త్ కామెడీ షో.. గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ టాప్ స్థానంలో దూసుకుపోతుంది. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై తమదైన స్టైల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇక ఇటీవల ప్రారంభంమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఫుల్ జోష్‏లో దూసుకుపోతుంది. ప్రముఖ కమెడియన్ సుధీర్ హోస్ట్‏గా వ్యవహరిస్తున్న ఈ షో.. బుల్లితెరపై టాప్ రేటింగ్‏తో దూసుకుపోతుంది. కామెడీతోపాటు.. మోటివేషనల్ స్క్రిట్స్ చేస్తూ ఆడియన్స్‏ను ఆకట్టుకుంటుంది శ్రీదేవి డ్రామా కంపెనీ. జబర్థస్త్ కామెడీలో కనిపించే హైపర్ ఆది, వర్ష, ఇమాన్యుయేల్, కెవ్వు కార్తీక్ కూడా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో అలరిస్తున్నారు.

ఇక షోలో జడ్జిగా నటి ఇంద్రజ వ్యవహరిస్తుండగా.. ఇప్పటికే ఈ షోలోకి పలువురు స్పెషల్స్ గెస్ట్స్ కూడా వచ్చి సందడి చేశారు. ఇక వచ్చే ఆదివారం ఎపిసోడ్‎ను సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం చేశారు. రజినీ పుట్టిన రోజు సందర్భంగా అందరూ డిఫరెంట్ కాన్సెప్ట్‏తో రజినీ స్టైల్ ఫాలో అయ్యారు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో కేవ్వు కార్తిక్ మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు. మరుగుజ్జు వాళ్ల కోసం.. వారిలాగే మారి ఓ స్కిట్ వేశాడు. మరుగుజ్జులా మారిన కార్తిక్ ఆ స్కిట్ కోసం చాలా కష్టపడినట్లుగా కనిపిస్తోంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన విచిత్ర సోదరులు సినిమాలోని పాత్రను సెలక్ట్ చేసుకుని అందరిని ఏడిపించేశాడు కార్తీక్. మరుగుజ్జుగా ఉన్న కార్తీక్ ఓ అమ్మాయిని ఇష్టపడగా.. పొట్టిగా ఉన్నావంటూ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతుంది. మధ్యలో వదిలేసి వెళ్లిపోతావా ? అని కార్తిక్ అడగ్గా… ఆ దేవుడే నిన్ను మధ్యలో వదిలేశాడు అని రివర్స్ ఆన్సర్ ఇచ్చి వెళ్లిపోతుంది. దీంతో కార్తిక్ ఎమోషనల్ అవుతూ.. అమ్మాయితో ఏడడుగులు నడవాలంటే ఆరడుగుల పొడవుండాలని మా అమ్మనాన్నలకు తెలయదేమో.. అందరూ నా ఆకారాన్నే చూస్తున్నారు.. కానీ నా మనసును చూడడం లేదేంటిరా ? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కార్తీక్. తన నటనతో అందరిచేత కంటతడి పెట్టించాడు కార్తీక్. ఈ స్కిట్‏తో కమల్ పాత్రను మరిపించాడని.. కార్తీక్ పర్ఫామెన్స్ చూసి ప్రశంసిస్తున్నారు నెటిజన్స్. వెండితెరపై కమల్ హాసన్.. బుల్లితెరపై కెవ్వు కార్తీక్ అని.. తన నటనకు.. డెడికేషన్‏కు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

Also Read: Katrina- Vicky kaushal: కత్రినా- విక్కీల ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ !.. ఆహ్వానితుల జాబితా ఇదే!

Anupama Parameswaran: పరువపు వాన కురిపిస్తున్న పరమేశ్వరన్.. అనుపమ అందాలు ఆపాతరమా..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!