AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: సన్నీ, సిరి మధ్య లవ్ ట్రాక్.. కోపంతో రెచ్చిపోయిన షణ్ముఖ్..

బిగ్‏బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. నిన్నటి ఎపిసోడ్‏లో కాజల్.. సన్నీకి దిష్టి తీయగా.. సిరి షణ్ముఖ్‏కు దిష్టి తీసింది.

Bigg Boss 5 Telugu: సన్నీ, సిరి మధ్య లవ్ ట్రాక్.. కోపంతో రెచ్చిపోయిన షణ్ముఖ్..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Dec 07, 2021 | 7:01 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. నిన్నటి ఎపిసోడ్‏లో కాజల్.. సన్నీకి దిష్టి తీయగా.. సిరి షణ్ముఖ్‏కు దిష్టి తీసింది. అయితే కాజల్‏కు ఎక్కువ క్లోజ్ అవ్వకు అని చెబుతూ ఎప్పటిలాగే హగ్ ఇచ్చుకున్నారు సిరి, షణ్ముఖ్. ఇక మరోవైపు ప్రియాంక వెళ్లిపోవడంతో ఒంటరిగా కూర్చొని బాధపడ్డాడు మానస్. దీంతో కాజల్ , సన్నీ వెళ్లి లవ్ సాంగ్ పాడుతూ టీజ్ చేయగా.. కేవలం మేము ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు మానస్. ఇక ఆ తర్వాత మానస్, కాజల్ ఇద్దరూ కలిసి…సన్నీకి.. సిరికి మధ్య లవ్ ట్రాక్ అంటూ కామెడీ చేసుకున్నారు. సిరి కనిపించగానే నీ అలియా భట్ వస్తుందంటూ కామెంట్స్ చేశారు. అయితే వీరి ముచ్చటను గమనిస్తున్న షణ్ముఖ్ తెగ ఫీల్ అయ్యాడు.

ఇక సిరి, షణ్ముఖ్ దగ్గరకు రాగానే హితోపదేశం మొదలుపెట్టాడు. నేను పడుకుంటే ఒకలా.. లేస్తే మరోలా బిహేవ్ చేస్తావ్. వాళ్లు యాక్సెప్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మాటలు వినాల్సి వచ్చింనందుకు నాకు కోపం వచ్చింది..ఇంకో రెండు వారాలు ఆ తర్వాత ఇవే నాకు వద్దు.. ఎవరు గేమ్ ఆడుతున్నాడో నీకు తెలియదు.. ఎవరు కొత్తగా ట్రాకులు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నీకు తెలియదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. నాకు తెలుసు.. నాతో గేమ్ ఆడేవాళ్లను ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అని సిరి చెబుతున్నా షణ్ముఖ్ పట్టించుకోలేదు. నేను అలగడం కాదు.. నాకు షేమ్‏గా అనిపిస్తుంది.. నా దగ్గర నుంచి వెళ్లిపో అంటూ సిరి పై మరోసారి ఫైర్ అయ్యాడు షణ్ముఖ్. దీంతో సిరి సారీ చెప్పింది.

అయితే దీనివలన నాకు లాస్ కాదు.. నీకే లాస్.. నీ క్యారెక్టర్ చాలా దరిద్రంగా బయటకు వెళ్తుంది.. నువ్వు ఎడ్డిదానిలాగే ఉంటున్నావ్.. ఇది ఇద్దరితోనూ ట్రాక్ నడుపుతుందనే పేరు వస్తుంది. మానస్, కాజల్ ఈ ట్రాక్ విషయంలో కావాలని పుష్ చేస్తున్నారు. నువ్ ఇలాంటివి చేస్తే నా పక్కన ఉండొద్దు.. నేను కష్టపడి నా పేరు క్రియేట్ చేసుకున్నా.. ఇప్పుడు నువ్వు వచ్చి కొత్త ట్రాకులు వద్దు.. పింకీ అయిపోయింది ఇప్పుడు నువ్వా ? నీ రెస్పాన్స్.. నీ ఇన్ టెన్షన్ ఏంటో నాకు తెలుసు.. నాకు చెప్పకు.. బయటకు వెళ్తే నువ్ ఎవరో నేను ఎవరో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు షణ్ముఖ్. దీంతో షన్నూ మాటలు అర్థం కాక జుట్టు పీక్కుంది సిరి.

Also Read: Santosh Sobhan: ఆయనతో పని చేసే అవకాశంనా కెరీర్‌లో చాలా త్వరగా రావడం అదృష్టం.. హీరో సంతోష్ ఆసక్తికర కామెంట్స్

Pushpa Movie: ఊరించి.. ఊరించి ఉసూరుమంనిపించిన పుష్ప టీమ్.. నిరాశలో అభిమానులు.

మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్