Santosh Sobhan: ఆయనతో పని చేసే అవకాశంనా కెరీర్‌లో చాలా త్వరగా రావడం అదృష్టం.. హీరో సంతోష్ ఆసక్తికర కామెంట్స్

సక్సెస్ ఫుల్ తెలుగు ఓటీటీ ఆహాకు మారుతి లాంటి ఆడియెన్స్ పల్స్ తెల్సిన డైరెక్టర్ తోడైతే ఎలాంటి విజయాలు వస్తాయో మంచి రోజులు వచ్చాయి, 3 రోజెస్ ప్రాజెక్ట్స్ నిరూపించాయి.

Santosh Sobhan: ఆయనతో పని చేసే అవకాశంనా కెరీర్‌లో చాలా త్వరగా రావడం అదృష్టం.. హీరో సంతోష్ ఆసక్తికర కామెంట్స్
Santhosh Sobhan
Follow us
KVD Varma

|

Updated on: Dec 06, 2021 | 9:32 PM

Santosh Sobhan: సక్సెస్ ఫుల్ తెలుగు ఓటీటీ ఆహాకు మారుతి లాంటి ఆడియెన్స్ పల్స్ తెల్సిన డైరెక్టర్ తోడైతే ఎలాంటి విజయాలు వస్తాయో మంచి రోజులు వచ్చాయి, 3 రోజెస్ ప్రాజెక్ట్స్ నిరూపించాయి. ఈ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ నేపథ్యంలో సెలబ్రేటింగ్ మాస్ ఎంటర్ టైనర్ మారుతి ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మారుతి, హీరో సంతోష్ శోభన్, ఆహా సీయీవో అజిత్ ఠాకూర్, హీరోయిన్ ఈషా రెబ్బ, నిర్మాత ఎస్ కే ఎన్, హీరోయిన్ పూర్ణ, నటి హేమ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ…అనేక కోరికలతో, ఆశలతో ఇండస్ట్రీకి చాలా మంది వస్తుంటారు. అలాంటి వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న గ్రేట్ ప్లాట్ ఫామ్ ఆహా అన్నారు సంతోష్. అలాగే మారుతి అన్నతో పనిచేసే అవకాశం నా కెరీర్ లో చాలా త్వరగా రావడం అదృష్టంగా భావిస్తుంటాను. ఆయనతో మళ్లీ మళ్లీ పనిచేసేందుకు వెయిట్ చేస్తున్నాను అన్నారు. మంచి రోజులు వచ్చాయి సినిమా నాకొక లర్నింగ్ ఎక్సీపిరియన్స్. మా సినిమాకు బెస్ట్ టీమ్ కుదిరింది అని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో..

అలాగే దర్శకుడు మారుతి మాట్లాడుతూ… నా కోసం మాస్ ఎంటర్ టైనర్ అనే ప్రోగ్రాం పెట్టడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. కానీ నేనేంటో నేనేం చేయగలనో ఎప్పుడూ మర్చిపోను. ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అఖండ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు. రాబోయో సినిమాలకు కూడా ఇదే ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా అని మారుతి అన్నారు. మంచి రోజులు వచ్చాయి సినిమా దీపావళి టైమ్ లో రిలీజ్ చేసినప్పుడు థియేటర్ ఎక్సీపిరియన్స్ కోరుకున్న వాళ్లు థియేటర్ కు వెళ్లారు ఓటీటీ కోసం వేచి చూసేవారు ఆగారు. ఇప్పుడు ఆహాలో మంచి రోజులు వచ్చాయి స్ట్రీమింగ్ మొదలవగానే చూడని వాళ్లంతా చూస్తున్నారు. మాకైతే సినిమా చేసిన రోజులన్నీ మళ్లీ రీకాల్ అయ్యాయి. ఆహా లాంటి ప్లాట్ ఫామ్స్ వల్ల సినిమా పెరుగుతోంది. ఆహాను నిలబెట్టేందుకు టీమ్ అంతా ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. అందుకే ప్రతి ఒక్క తెలుగు వారు ఇది మన ఓటీటీ అని భావించండి,  నెక్ట్ ఇయర్ ఇంకో ప్రోగ్రాం ఆహాకు చేస్తాను అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: Gaming Experience: స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడటం సరదానా.. మంచి గేమింగ్ అనుభవం కోసం ఎటువంటి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలంటే..

Post Paid Plans: ఎయిర్‌టెల్..వోడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్.. పెరగనున్న ప్లాన్ టారిఫ్‌లు!

Rajnath Singh: రష్యా మంత్రులతో సమావేశంలో చైనా చొరబాట్ల అంశం.. సరిహద్దుల్లో ఆక్రమణలపై కఠినంగా మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!