Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Paid Plans: ఎయిర్‌టెల్..వోడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్.. పెరగనున్న ప్లాన్ టారిఫ్‌లు!

గత నెలలో, భారతీ ఎయిర్‌టెల్, Vi (వోడాఫోన్ ఐడియా), రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల టారిఫ్ లను పెంచాయి. దీనితరువాత ఇప్పుడు ఎయిర్‌టెల్, Vi (వోడాఫోన్ ఐడియా) తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Post Paid Plans: ఎయిర్‌టెల్..వోడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్.. పెరగనున్న ప్లాన్ టారిఫ్‌లు!
Post Paid Tariff Plans
Follow us
KVD Varma

|

Updated on: Dec 06, 2021 | 3:35 PM

Post Paid Plans: గత నెలలో, భారతీ ఎయిర్‌టెల్, Vi (వోడాఫోన్ ఐడియా), రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్‌ల టారిఫ్ లను పెంచాయి. దీనితరువాత ఇప్పుడు ఎయిర్‌టెల్, Vi (వోడాఫోన్ ఐడియా) తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి జూలైలో, పోస్ట్‌పెయిడ్ సెగ్మెంట్‌లోని కార్పొరేట్ వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ టారిఫ్‌లను పెంచింది. ఇప్పుడు మరోసారి పోస్ట్ పెయిడ్ టారిఫ్ లను పెంచే అవకాశం కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.

రానున్న కొద్ది నెలల్లో పోస్ట్‌పెయిడ్ కస్టమర్లపై భారం కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పోస్ట్‌పెయిడ్ మార్కెట్ ఆదాయం పరంగా రూ. 22,000 కోట్లు. మొత్తం టెలికాం సెక్టార్‌లోని యాక్టివ్ సబ్‌స్క్రైబర్‌లలో పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు 5 శాతం ఉన్నారు. టెలికాం కంపెనీలు తమ ఆదాయంలో 15% పోస్ట్‌పెయిడ్ సెగ్మెంట్ నుండి పొందుతాయి. వీరిలో 50-60% మంది ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లు. 34% పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు మూడు మెట్రోలలో ఉన్నారు. మరో 36% పట్టణ కేంద్రీకృత A-సర్కిల్‌లో ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా 43% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. అదే సమయంలో, భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ వాటా 28%.

దేశంలో 53 మిలియన్ల పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు

ప్రస్తుతం దేశంలో మొత్తం 106 కోట్ల మంది 4G వినియోగదారులు ఉన్నారు. ఇందులో రిలయన్స్ జియో అత్యధికంగా 44 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. ఎయిర్‌టెల్‌కు 35 కోట్లు, వీఐకి 27 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, రెండు కంపెనీల (Vi + Airtel) కొత్త ధరల ప్రభావం 62 కోట్ల మంది, దాదాపు 58.5% మంది వినియోగదారులపై ఉంటుంది. అంటే 106 కోట్ల మందిలో దాదాపు 53 మిలియన్ల మంది పోస్ట్ పెయిడ్ యూజర్లు ఉన్నారు.

కంపెనీ ఎంత ఆలస్యం చేస్తే అంత ఎక్కువ నష్టం

టెల్కోలు పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌లను పెంచకపోతే ఆశ్చర్యం కలుగుతుందని టెక్నాలజీ, మీడియా, టెలికాం కన్సల్టెంట్ సంజయ్ కపూర్ అంటున్నారు. సుంకం పెంపులో ఎంత ఆలస్యం జరిగితే కంపెనీలకు అంత నష్టం వస్తుంది. కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయడం వారికి శ్రేయస్కరం కాదు. ఆలస్యం చేస్తే వారికే నష్టం. ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ప్లాన్ టారిఫ్ పెంచినా.. వారి సబ్‌స్క్రైబర్లు వేరే ఆపరేటర్ వద్దకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.

ఒక్కో యూజర్‌పై సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) పెంచాలంటే ప్లాన్‌ల ధరలను పెంచాల్సిందేనని టెలికాం కంపెనీలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ప్రీపెయిడ్ టారిఫ్‌ను పెంచడం ARPUలో సహాయపడుతుంది, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను పెంచడం కంపెనీకి మరింత మద్దతునిస్తుంది. Vodafone-Idea (Vi)కి ఇది చాలా అవసరం. ప్రస్తుతం Vodafone-Idea.. ARPU ప్రస్తుతం రూ.109, ఇది అన్ని కంపెనీల కంటే తక్కువ. భారతీ ఎయిర్‌టెల్ యొక్క ARPU రూ.153 మరియు రిలయన్స్ జియోది రూ.143.6గా ఉన్నాయి.

Also Read: Home Loan Tips: సొంతిల్లు కొనాలకుంటున్నారా.. తక్కువ వడ్డీతో హోమ్ లోన్ అందించే బ్యాంకులు ఇవే!

Income Tax Refund: ఐటీఆర్‌లో ‘నామినీ’ని చేర్చడం అవసరమా.. చట్టం ఏం చెబుతుందంటే?