E-Pan Card: 10 నిమిషాల్లో ఈ-పాన్ కార్డు..! ఎలా దరఖాస్తు చేయాలంటే..

ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి అయింది. బ్యాంకు ఖాతా ద‌గ్గ‌ర నుంచి ఐటీ రిట‌ర్నుల ఫైల్లింగ్ చేసే వ‌ర‌కు పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే....

E-Pan Card: 10 నిమిషాల్లో ఈ-పాన్ కార్డు..! ఎలా దరఖాస్తు చేయాలంటే..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 06, 2021 | 3:14 PM

ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి అయింది. బ్యాంకు ఖాతా ద‌గ్గ‌ర నుంచి ఐటీ రిట‌ర్నుల ఫైల్లింగ్ చేసే వ‌ర‌కు పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే.. అయితే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అయితే ఈ నిరీక్షణ లేకుండా ఈ-పాన్ కార్డు పొందవచ్చు. ఆదాయపు ప‌న్ను శాఖ‌ వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారులకు ఈ స‌దుపాయాన్ని అందిస్తుంది. అయితే ఆధార్ నెంబ‌రుకు మీ మొబైల్ నెంబ‌రు అనుసంధానించి ఉండాలి లేకుంటే ఈ పాన్ పొందలేరు.

ఈ-పాన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

  • దరఖాస్తుదారులు ఐటి పోర్ట‌ల్‌ https://eportal.incometax.gov.in లాగిన్ అవ్వాలి.
  • హోమ్ పేజ్‌ని క్లిక్ చేసి క్విక్ లింక్స్‌లో అందుబాటులో ఉన్న ఇన్స్టెంట్ ఈ-పాన్‌పై క్లిక్ చేయాలి.
  • రెండు ఆప్ష‌న్లు అందుబాటులోకి వ‌స్తాయి. మొద‌టిది ‘గెట్ న్యూ ఈ-పాన్’, కొత్త‌గా రిజిస్ట‌ర్ చేసుకునే వారు ఈ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.
  • త‌ర్వాత 12 అంకెల ఆధార్ నెంబ‌రును నమోదు చేయాలి. ఆధార్ కు అనుసంధానమైన మీ రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది.
  • ఓటీపీ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత మీ ఫోటో, చిరునామా, పుట్టిన తేది, జెండ‌ర్ వంటి వ్య‌క్తిగ‌త వివరాలు క‌నిపిస్తాయి.
  • వాటిని ధృవీక‌రిస్తే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌వుతుంది. భ‌విష్య‌త్తు రిఫ‌రెన్స్ కోసం ఎక్నాలెజ్డ్‌మెంట్ నెంబ‌ర్ జ‌న‌రేట్ అవుతుంది.
  • ఇక రెండ‌వ ఆప్ష‌న్ ‘చెక్ స్టేట‌స్‌/డౌన్‌లోడ్ పాన్’, ఇక్క‌డ నుంచి ఈ-పాన్ పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
  • ఈ-పాన్ కేటాయించినందుకు ఛార్జీలు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. ఈ-పాన్ మీ ఈ-మెయిల్ ఐడికి వ‌స్తుంది.

Read Also.. Semiconductors: వేధిస్తున్న సిలికాన్ వేఫర్ల కొరత.. టాటా గ్రూప్ ప్రయత్నాలకు ఆటంకం..!