EPFO Alert: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 22.55 కోట్ల పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ జమ..
ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్ వడ్డీని నేరుగా 22.55 కోట్ల పీఎఫ్ ఖాతాలకు
ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్ వడ్డీని నేరుగా 22.55 కోట్ల పీఎఫ్ ఖాతాలకు జమ చేసింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో ట్విట్టర్ ద్వారా పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.50 శాతం వడ్డీని ఖరారు చేసినట్లుగా అందులో స్పష్టం చేసింది. 8.50 శాతం వడ్డీని 22.55 కోట్ల పీఎఫ్ అకౌంట్లలోకి నేరుగా క్రెడిట్ అయినట్లు తెలిపింది. ఈపీఎఫ్‌వో ప్రస్తుతం పీఎఫ్ పెట్టుబడులపై 8.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఇదిలా ఉంటే అక్టోబర్ 30వ తేదీన ఇచ్చిన సర్క్యులర్‌లో, EPFO 2020-21 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల ఖాతాలకు వడ్డీ రేటును ప్రకటించిన సంగతి విదితమే.
22.55 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. @LabourMinistry @esichq @PIB_India @byadavbjp @Rameswar_Teli
— EPFO (@socialepfo) December 6, 2021