Rating: రేటింగ్ చూసి వస్తువులు కొంటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు, మీరు రేటింగ్ చూసి వస్తువులను కొనుగోలు చేస్తే, అప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీల ప్లాట్‌ఫారమ్‌లలో రేటింగ్‌లు, సమీక్షలు ఇష్టమున్నట్లు చూపిస్తున్నారు....

Rating: రేటింగ్ చూసి వస్తువులు కొంటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 06, 2021 | 12:50 PM

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు, మీరు రేటింగ్ చూసి వస్తువులను కొనుగోలు చేస్తే, అప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీల ప్లాట్‌ఫారమ్‌లలో రేటింగ్‌లు, సమీక్షలు ఇష్టమున్నట్లు చూపిస్తున్నారు. ఏదైనా ఉత్పత్తిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి, కస్టమర్‌లు ఆ ఉత్పత్తి రేటింగ్, సమీక్షను ఎక్కువగా విశ్వసిస్తారు. కంపెనీలు స్టార్ రేటింగ్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు.

బ్రిటిష్ రెగ్యులేటర్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) ఈ ఏడాది జూన్‌లో అమెజాన్, గూగుల్‌పై పరిశోధనలు ప్రారంభించింది. ఈ రెండు కంపెనీలు నకిలీ సమీక్షల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయలేదని, ఇది UKలో చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఆన్‌లైన్ దుకాణదారులు నకిలీ సమీక్షలను చదవడం ద్వారా గందరగోళానికి గురవుతున్నారని CMA CEO అన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఫేక్ రివ్యూ రేటింగ్‌కు వ్యతిరేకంగా చట్టం ఉంది, కానీ భారతదేశంలో అలాంటి చట్టం లేదు. ఈ-కామర్స్ కంపెనీల ద్వారా వస్తువులను విక్రయించే విక్రేతలు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ-కామర్స్ కంపెనీల అమ్మకం దారులు ఉత్పత్తిని రేటింగ్ కోసం వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌లు ఇస్తున్నారు. కస్టమర్లకు ఫోన్ చేసి కొనుగోలు చేసిన వస్తువుకు 5 స్టోర్ రేటింగ్ ఇవ్వాలని అడుగుతున్నారు. బదులుగా, వారు ఉత్పత్తిపై వారంటీ లేదా అదనపు వారంటీని అందిస్తున్నారు.

ఇ-కామర్స్ మార్కెట్ 2030 నాటికి 40 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుంది

భారతదేశంలో ఇ-కామర్స్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఒక నివేదిక పేర్కొంది. 2019లో ఇది కేవలం 4 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. ఈ వృద్ధి రేటు వెనుక డిజిటల్ విప్లవం ఒక పెద్ద కారణం. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ఆన్‌లైన్ షాపింగ్ విపరీతంగా పెరగడానికి ఇదే కారణం.

2019లో లైఫ్‌స్టైల్ రిటైల్ మార్కెట్ విలువ 90 బిలియన్ డాలర్లుగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. ఇది 2026 నాటికి $156 బిలియన్లకు చేరుకోగా, 2030 నాటికి $215 బిలియన్లకు చేరుకుంటుంది. ఇందులో దుస్తులు, పాదరక్షలు, ఫ్యాషన్ ఉపకరణాలు, సౌందర్య సాధనాలు, చిన్న ఉపకరణాలు, గృహావసరాలు ఉన్నాయి.

Read Also.. Post Office Returns: ఫిక్స్‌డ్ డిపాజిట్ బ్యాంక్‎లో బెటరా.. పోస్ట్ ఆఫీస్‎లో బెటరా.. ఎందులో వడ్డీ ఎక్కువ..