Aadhar: మీరు ఆధార్ కార్డు భద్రంగా ఉండాలంటే.. ఇవి పాటించండి..

ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది.. ఎందుకంటే దేనికైనా ఆధారే ఆధారం కాబట్టి.. కానీ మన ఆధార్ ఎంతవరకు భద్రంగా ఉంచుకుంటున్నాం...

Aadhar: మీరు ఆధార్ కార్డు భద్రంగా ఉండాలంటే.. ఇవి పాటించండి..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 06, 2021 | 12:26 PM

ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది.. ఎందుకంటే దేనికైనా ఆధారే ఆధారం కాబట్టి.. కానీ మన ఆధార్ ఎంతవరకు భద్రంగా ఉంచుకుంటున్నాం. పలు సందర్భాల్లో వివిధ కారణాల వల్ల ఆ కార్డులు చేతులు మారుతుంటాయి. అలాంటి సమయాల్లో ఆధార్‌ కార్డ్‌ వివరాలకు ముంపు పొంచి ఉందని గుర్తించాలి. ప్రస్తుతం సైబర్ క్రైమ్ మోసాలు పెరిగిపోతున్నాయి.

సైబర్‌ నేరగాళ్లు ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రయత్నాల్లో భాగంగా మన ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డ్‌ వివరాలతో బ్యాంక్‌ అకౌంట్‌లలో ఉన్న నగదును కాజేంస్తుంటారు. అయితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్‌ నేరస్తుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ముందుగా మీ ఆధార్, పాన్ వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు.

మీరు మెయిల్ పంపించి ప్రింట్ తీసుకుంటారు. కానీ దాన్ని డిలీట్ చేయించాలి. ఎందుకంటే మన ఆధార్ ఉపయోగించి మోసాలకు పాల్పడతారు. లేదా డేటాను అమ్ముకుంటారు. అనుమానంగా ఉన్న వెబ్‌ సైట్‌లలో ఎట్టి పరిస్థితుల్లో ఆధార్‌ కార్డ్‌ వివరాలు నమోదు చెయ్యొద్దు. అప్‌లోడ్‌ కూడా చేయొద్దు. మీరు మీ సిబిల్‌ స్కోర్‌ను ఎప్పుడు ట్రాక్‌ చేస్తూ ఉండాలి.

సిబిల్‌ స్కోర్‌ చెక్‌ చేసే సమయంలో మీకు తెలియకుండా ఇతరులు ఎవరైనా ఆధార్‌ కార్డ్‌ సాయంతో అప్పులు తీసుకనే అవకాశం ఉంటుంది. అందుకే మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ముఖ్యంగా మీకు వచ్చే వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌లను ఎవరికీ షేర్ చేయొద్దు. ఆధార్‌ కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ ఏజెన్సీలు ప్రజల వ్యక్తిగత వివరాలను సెక్యూర్‌గా ఉంచేందుకు ఎప్పటికప్పుడు మీకు సలహాలు ఇస్తుంటాయి. మీ డేటా వినియోగానికి సంబంధించిన ఏజన్సీలపై అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. ఇలా చేయడం వల్ల ఆధార్‌ కార్డ్‌ను సైబర్‌ నేరస్తుల నుంచి జాగ్రత్తగా ఉంచుకోవచ్చు.

Read Also.. Semiconductors: వేధిస్తున్న సిలికాన్ వేఫర్ల కొరత.. టాటా గ్రూప్ ప్రయత్నాలకు ఆటంకం..!

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్