Pushpa Movie Trailer: ‘పుష్ప.. పుష్పరాజ్ తగ్గేదే లే’… నెక్ట్స్ లెవల్‌లో ట్రైలర్.. పూనకాలే
Pushpa: పుష్ప... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కోసం అభిమానులు , ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ సినిమానుంచి ఏచిన్న అప్ డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది...
Pushpa: పుష్ప… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కోసం అభిమానులు , ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ సినిమానుంచి ఏచిన్న అప్ డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీకి జోడిగా రష్మిక నటిస్తోంది. ఇప్పటి వరకు స్టైలిష్ లుక్‌లో కనిపించిన బన్నీ తొలి సారి పూర్తి మాస్ రోల్‌లో ఒక లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. దీతో ఈ సినిమాపై సహంజగానే అంచనాలు పెరిగిపోతాయి. అందులోనూ ఆర్య, ఆర్య2 వంటి చిత్రాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.. ట్రైలర్ లో బన్నీ నట విశ్వరూపం చూపించారు. మాస్ పాత్రలో ఇరగదీశాడు. ట్రైలర్ ఆసాంతం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. ఒకటి రెండు చోట్ల.. రష్మిక వెంట పడుతూ కనిపించాడు పుష్పరాజ్. అలాగే ఈ సినిమా సునీల్ విలన్ గా కనిపించాడు.. అలాగే ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Sajjala Ramakrishna Reddy: ఓటిఎస్‌పై చంద్రబాబు అనవసర రాద్దాంతం చేస్తున్నారు: సజ్జల కీలక వ్యాఖ్యలు
Jacqueline: మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌కు ఊరట.. విదేశాలకు వెళ్లడానికి అనుమతిచ్చిన అధికారులు..
Jacqueline: మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌కు ఊరట.. విదేశాలకు వెళ్లడానికి అనుమతిచ్చిన అధికారులు..