- Telugu News Photo Gallery Cinema photos Authorities have decided to allow Jacqueline Fernandez, who received look out notices in the Sukesh case, to travel abroad.
Jacqueline: మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌కు ఊరట.. విదేశాలకు వెళ్లడానికి అనుమతిచ్చిన అధికారులు..
Jacqueline: ప్రముఖులను మోసం చేస్తూ కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సుఖేష్ చంద్రశేఖర్ కేసులో ఇరుక్కున్న జాక్వెలిన్‌కు ఊరట లభించింది. లుక్ అవుట్ నోటీసులు అందించిన నేపథ్యంలో దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసిన అధికారలు తాజాగా..
Updated on: Dec 06, 2021 | 3:07 PM

బడా పారిశ్రామిక వేత్తలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సుఖేశ్ చంద్రశేఖర్‌పై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

సుఖేశ్ చంద్రశేఖర్‌పై దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహికి రూ. కోట్ల విలువైన కానుకలు ఇచ్చినట్లు తేలింది. జాక్వెలిన్‌కు ఏకంగా డైమండ్లు , 52 లక్షల విలువైన గుర్రం , 9 లక్షల విలువైన పిల్లితో పాటు మొత్తం రూ. 10 కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్టు తెలిపారు.

దీంతో సుఖేశ్‌తో జాక్వెలిన్ స్నేహం ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంది. సుఖేశ్‌తో సంబంధాల కారణంగా జాక్వెలిన్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఆదివారం విదేశాలకు వెళ్లడానికి ముంబయి ఎయిర్‌పోర్ట్ వెళ్లగా పోలీసులు ఆమెను అడ్డుకున్న విషయం తెలిసిందే

అయితే తాజాగా ఆమెకు ఊరట లభించింది. జాక్వెలిన్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు తర్వాత ఆమెను విడిపెట్టారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లేందుకు ఆమెకు అనుమతి ఇచ్చారు. దీంతో విదేశాల్లో షో చేసేందుకు వెళ్లారు జాక్వెలిన్.

ఇదిలా ఉంటే జాక్వెలిన్-సుఖేశ్‌ల మధ్య గత జనవరి నుంచి పరియం ఏర్పడింది. జాక్వెలిన్‌తో చేసిన ప్రయాణం సుఖేశ్ ఏకంగా స్పెషల్ ఫ్లైట్‌ను బుక్ చేశాడని దీనికి రూ. 8 కోట్లు ఖర్చు చేశారని అధికారులు తెలిపారు. సుఖేశ్ ప్రస్తుతం రూ. 200 కోట్ల వసూళ్ల కేసులో జైలులో ఉన్న విషయం తెలిసిందే.




