AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaming Experience: స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడటం సరదానా.. మంచి గేమింగ్ అనుభవం కోసం ఎటువంటి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలంటే..

గేమింగ్ యాప్‌ల డిమాండ్ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. పబ్జ్(PUBG) కొత్త వెర్షన్ ప్రారంభించిన వెంటనే కేవలం ఒక వారంలో 10 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను పూర్తి చేసింది.

Gaming Experience: స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడటం సరదానా.. మంచి గేమింగ్ అనుభవం కోసం ఎటువంటి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలంటే..
Gaming Smartphone
KVD Varma
|

Updated on: Dec 06, 2021 | 4:17 PM

Share

Gaming Experience: గేమింగ్ యాప్‌ల డిమాండ్ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. పబ్జ్(PUBG) కొత్త వెర్షన్ ప్రారంభించిన వెంటనే కేవలం ఒక వారంలో 10 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను పూర్తి చేసింది. దీన్ని బట్టి మనం ఇప్పుడు మొబైల్ గేమ్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెడుతున్నాయి. మీరు కూడా కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు కొన్ని ప్రత్యేక విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మీ గేమింగ్ అనుభవాన్ని ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. కాబట్టి అత్యుత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

రిఫ్రెష్ రేట్ మరియు టచ్ శాంప్లింగ్ రేట్

మీరు గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ముందుగా మీరు ఫోన్‌లోని రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్‌పై శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం, మార్కెట్‌లో 320Hz టచ్ శాంప్లింగ్ రేటుతో స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి మంచి ఎంపిక. కానీ మీరు 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడం గొప్ప ఎంపికగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇక రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే..120Hz రిఫ్రెష్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు. రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌పై కనిపించే చిత్రం ఒక సెకనులో ఎన్నిసార్లు రిఫ్రెష్ అవుతుందో తెలిపే దాన్ని ఫోన్ రిఫ్రెష్ రేట్ అంటారు. దీనిని హార్ట్జ్‌లో లెక్కిస్తారు.

RAM.. ప్రాసెసర్

ఏ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌కైనా ర్యామ్ చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్‌లో 6 జీబీ, 8 జీబీ, 12 జీబీ ర్యామ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అయితే, సగటు గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌కు 8GB RAM సరిపోతుంది. కానీ ఫోన్‌లో 12 GB RAM ఉంటే, అది గొప్ప ఎంపికగా చెప్పుకోవచ్చు. మరోవైపు, మంచి గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌కు మంచి ప్రాసెసర్ అవసరం. ప్రస్తుతం మార్కెట్లోకి మంచి గేమింగ్ ప్రాసెసర్లు వస్తున్నాయి. దీని ప్రాసెసింగ్ చాలా వేగంగా ఉంటుంది, దీని కారణంగా గేమింగ్ సమయంలో ఫోన్ ఆగిపోదు.

శీతలీకరణ పొర

అన్ని గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కుతాయి. అయితే శీతలీకరణ పొర సహాయంతో, అది చల్లగా ఉంచే ఏర్పాటు ఫోన్ లో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, అదనపు కూలింగ్ లేయర్ లేదా ఫ్యాన్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలి. అలాగే, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఫోన్‌లో ఉంటే, అది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

గ్రాఫిక్స్ కార్డ్

స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలో అన్ని చిత్రాలు, వీడియోలు కనిపిస్తాయి. ఈ గ్రాఫిక్స్ కార్డ్‌లు వాటన్నింటినీ డిస్‌ప్లేకు రెండర్ చేసే పనిని చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఏదైనా స్మార్ట్‌ఫోన్‌కు మంచి గ్రాఫిక్స్ కార్డ్ అవసరం. మాలి (GPU) వంటి గ్రాఫిక్స్ కార్డ్ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగిస్తారు.

శక్తివంతమైన బ్యాటరీ

గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ ఒక ముఖ్యమైన భాగం. సాధారణంగా, 5000mAh బ్యాటరీ కలిగిన ఫోన్ ఉత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా పరిగణిస్తారు. కానీ ఫోన్ బ్యాటరీ 6,000 లేదా 7000mAh అయితే, ఇది చాలా మంచిది. ఎందుకంటే గేమింగ్ సమయంలో బ్యాటరీ ఎక్కువగా ఖర్చు అవుతుంది. దీని కోసం ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవసరం.

Also Read: Home Loan Tips: సొంతిల్లు కొనాలకుంటున్నారా.. తక్కువ వడ్డీతో హోమ్ లోన్ అందించే బ్యాంకులు ఇవే!

Income Tax Refund: ఐటీఆర్‌లో ‘నామినీ’ని చేర్చడం అవసరమా.. చట్టం ఏం చెబుతుందంటే?