- Telugu News Photo Gallery Technology photos Twitter Introducing new audio tweets feature for ios users
Twitter Audio: ఇకపై ట్వీట్లను చదవడమే కాదు, వినొచ్చు కూడా.. సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్న ట్విట్టర్..
Twitter Audio: ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే ట్విట్టర్ తాజాగా మరో ఆసక్తికరమై ట్వీట్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఆడియో రూపంలో ట్వీట్ చేసుకునేందుకు గాను ఓ ఫీచర్‌ను పరిశీలిస్తోంది...
Updated on: Dec 06, 2021 | 2:38 PM

ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లలో ట్విట్టర్ ఒకటి. ప్రముఖులు ఎంతో మంది ఈ వేదికనే తమ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు.

అయితే ఇప్పటి వరకు ట్వీట్లను టెస్ట్ రూపంలో మాత్రమే చేస్తామనే విషయం మనందరికీ తెలిసిందే. అలా కాకుండా ఆడియో రూపంలో ట్వీట్‌లు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి.

దీనిని నిజం చేయడానికే ట్విట్టర్ ఓ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్‌తో ఇకపై యూజర్లు ట్వీట్లను ఆడియో రూపంలో పంపించుకోవచ్చు.

ఐఓస్ యూజర్లకు తొలుత ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి రానుంది.

ఆడియో ట్వీట్ చేయడం కోసం ముందుగా ఐఓస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే గ్యాడ్జెట్‌లో ట్విట్టర్ యాప్‌ను ఓపెన్ చేసి కంపోజ్ ట్వీట్‌పై నొక్కాలి. అనంతరం వాయిస్ ఐకాన్‌పై ట్యాప్ చేసి మీ సందేశాన్ని రికార్డ్ చేయాలి.

ఇలా 2 నిమిషాల 20 సెకన్ల పాటు ఆడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అనంతరం ట్వీట్‌పై క్లిక్ చేస్తే చాలు వెంటనే మీ ఆడియో ట్వీట్‌గా పోస్ట్ అవుతుంది.





























