AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vantalakka: ఏ బుల్లితెర నటికి దక్కని అభిమానం వంటలక్క సొంతం.. అనాథాశ్రమంలో దీప పుట్టిన రోజుని జరిపిన ఫ్యాన్స్..

Premi viswanath-vantalakka: కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథన్ ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో మలయాళంలో సూపర్ హిట్ సీరియల్ కరతముత్తులో నటించే అవకాశం దక్కించుకుంది..

Vantalakka: ఏ బుల్లితెర నటికి దక్కని అభిమానం వంటలక్క సొంతం.. అనాథాశ్రమంలో దీప పుట్టిన రోజుని జరిపిన ఫ్యాన్స్..
Vankatalakka Birth Day
Surya Kala
|

Updated on: Dec 06, 2021 | 4:16 PM

Share

Premi viswanath-vantalakka: కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథన్ ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో మలయాళంలో సూపర్ హిట్ సీరియల్ కరతముత్తులో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సీరియల్ లో ప్రేమి నటనకి మంచిపేరు వచ్చింది. మలయాళ టీవిరంగంలో సంచలనాన్ని సృష్టించిన ఈ సీరియల్ తెలుగులో కార్తీక దీపంగా అడుగు పెట్టింది. ఇక్కడ కూడా ఈ సీరియల్ సూపర్ హిట్. సీరియల్స్ అంటే ఆడవారే చూస్తారు అన్న మాటను చెరిపేసి.. మగవాళ్లకు కూడా తన అభిమానులుగా చేసుకుంది. దీనికి ఈ సీరియల్ లోని ప్రధాన పాత్రలు అయితే ప్రధాన కారణం మాత్రం ఖచ్చితంగా వంటలక్కగా నటించిన ప్రేమి విశ్వనాధ్ అని చెప్పవచ్చు.

దేశ విదేశాల్లో ఈ సీరియల్ కు ముఖ్యంగా దీపకు ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వంటలక్కగా అంత ఫేమ్ సంపాదించుకుంది కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథన్. తెలుగు ఇంట్లో టీవీ ఉన్న ప్రతి ఒక్కరికీ దీప గురించి తెలుసు. తెలుగు ప్రేక్షకులకు చేరువై రికార్డులను సృష్టిస్తున్న వంటలక్క ​కు విశేషమైన ఆదరణ దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాలలో వంటలక్కకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దీపగా ప్రేమి విశ్వనాథ్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా..

తెలుగు రాష్ట్రాల్లో సినిమా నటీనటులతో సమానంగా ప్రేమి విశ్వనాధ్ ఒక్క వంటలక్క పాత్రతోనే ఫేమస్ అయింది. వెండి తెర స్టార్ హీరోయిన్ల రేంజ్ లో అభిమానగణాన్ని సొంతం చేసుకుంది. ఈ విషయం మరోసారి రుజువైంది. ఇటీవల ప్రేమి విశ్వనాధ్ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు ఫోటోకి పాలాభిషేకం చేశారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు తమ అభిమానం తెలియజేయడానికి ఇలా చేయడం చూస్తాం.. కానీ ఓ బుల్లి తెర నటి.. అదీ  ఒకే ఒక్క సీరియల్ నటిస్తున్న  నటికి ఇలా పుట్టిన రోజు వేడుకలను చేయడం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు ..

ప్రేమి పుట్టిన రోజు డిసెంబర్ 2 సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పడమే కాదు.. కొంతమంది అభిమానులు      అనాధాశ్రమంలో కేక్ కట్ చేయించి అక్కడ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. వంటలక్క ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. అయితే కార్తీకదీపం సీరియల్ సాగదీయడంతో.. రోజు రోజుకీ ప్రేక్షకుల ఆదరణ కోల్పోతుంది. రిపీట్ సినిమాలకు కూడా కార్తీకదీపం రేటింగ్ బీట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:  అప్పు నటించిన వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీ…గంధడ గుడి టీజర్ రిలీజ్.. విజువల్ ట్రీట్